Telangana corona Updates: తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు.. నిన్న ఒక్కరోజే ఇద్దరు మృతి..

Telangana corona Updates: తెలంగాణలో మళ్లీ కరోనా తన ప్రభావాన్ని చూపిస్తుంది. నిన్న రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో 39,000 కరోనా నిర్దారణ పరీక్షలు

Telangana corona Updates: తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు.. నిన్న ఒక్కరోజే ఇద్దరు మృతి..
corona-virus

Updated on: Mar 10, 2021 | 12:15 PM

Telangana corona Updates: తెలంగాణలో మళ్లీ కరోనా తన ప్రభావాన్ని చూపిస్తుంది. నిన్న రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో 39,000 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. 189 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 3,00,342కు చేరింది. ఈమేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంక్య 1646కి చేరింది.

కరోనా బారి నుంచి నిన్న ఒక్కరోజే 176 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,96,916కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,780 ఉండగా.. వీరిలో 693 మంది హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 34 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 90,55,741కు చేరింది.

 

Also Read:

తెలంగాణ పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్‏గా దేత్తడి హారిక.. ముదురుతున్న వివాదం పై స్పందించిన బిగ్‏బాస్ బ్యూటీ..

Dethadi Harika: దేత్తడి హారికకు భారీ షాక్.. టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ఆమె నియామక వివరాలు తొలగింపు