తెలంగాణలో కొత్తగా 27 కరోనా కేసులు…

|

May 20, 2020 | 9:37 PM

తెలంగాణలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 1,661కి చేరింది. ఇక 608 యాక్టివ్ కేసులు ఉండగా.. 1013 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఇవాళ ఇద్దరు కరోనా బాధితులు డిశ్చార్జ్ కాగా.. 15 కొత్త కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదైతే.. మిగిలిన 12 ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారివిగా […]

తెలంగాణలో కొత్తగా 27 కరోనా కేసులు...
Follow us on

తెలంగాణలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 1,661కి చేరింది. ఇక 608 యాక్టివ్ కేసులు ఉండగా.. 1013 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు 40 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు ఇవాళ ఇద్దరు కరోనా బాధితులు డిశ్చార్జ్ కాగా.. 15 కొత్త కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదైతే.. మిగిలిన 12 ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారివిగా తేలింది. ఇప్పటివరకు 89 మంది వలస కూలీలకు కరోనా సోకింది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే.. వరంగల్ రూరల్, యదాద్రి, వనపర్తిలలో ఇప్పటి దాకా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, భూపాలపల్లి, నాగర్‌కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, ఆసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నారాయణపేట, వరంగల్ అర్బన్, గద్వాల్, జనగాం, నిర్మల్ జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కరోనా కేసులు కూడా నమోదు కాలేదు అని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Read More:

షాకింగ్: కరోనా వ్యాక్సిన్ ప్రయోగం విఫలం.. ఇక కష్టమేనా!

10, 12వ తరగతి పరీక్షలు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూల్స్ ఇవే..

రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం..

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఓఆర్​ఆర్​పై వాహనాలకు అనుమతి…

మందుబాబులకు గుడ్ న్యూస్.. స్విగ్గీ, జొమాటోలో లిక్కర్ డెలివరీ..

కిమ్‌ను బీట్ చేసిన మోదీ.. ప్రపంచంలోనే మూడోస్థానం..

హైకోర్టు సంచలన తీర్పు.. మైనర్ అబార్షన్‌కు అనుమతి…