Telangana Corona Updates: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గు ముఖం పడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 206 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. అయితే కరోనా కారణంగా ఒక్క రోజులు ఇద్దరు మృతి చెందారు. ఇక కరోనాను జయించిన వారిలో 346 మంది ఉన్నారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధిక కేసులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది.
కరోనా బులెటిన్ ప్రకారం.. తాజాగా నమోదైన కేసులతో కలుపుకుని తెలంగాణ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,91,872కి చేరింది. మరోవైపు 2,86,244 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం 1,579 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 4,049 యాక్టీవ్ కేసుల ఉన్నాయి. వీరిలో 1,768 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 2,281 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.
Also read:
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చిరుత పులి కలకలం.. ఏకంగా రన్ వే పై 10 నిమిషాల పాటు..