Corona Virus Threat: కరోనా ముప్పు వీరికి వచ్చే ఛాన్స్‌లు చాలా తక్కువట.. షాకింగ్ విషయాలు వెల్లడించిన సీరో సర్వే..

Corona Virus Threat: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. ఇప్పటికీ తీవ్రంగా భయపెట్టిస్తోంది. ఓవైపు వ్యాక్సిన్..

Corona Virus Threat: కరోనా ముప్పు వీరికి వచ్చే ఛాన్స్‌లు చాలా తక్కువట.. షాకింగ్ విషయాలు వెల్లడించిన సీరో సర్వే..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 18, 2021 | 11:48 AM

Corona Virus Threat: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. ఇప్పటికీ తీవ్రంగా భయపెట్టిస్తోంది. ఓవైపు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. కరోనా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. వృద్ధులు, ఇతర వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచించారు. అంతేకాదు.. ధూమపానం చేసే వారికి కరోనాను ఎదుర్కొనే శక్తి ఉండదని, వారి ప్రాణాలకే ముప్పు అని కూడా పలువురు నిపుణులు చెప్పారు. అయితే, తాజాగా కరోనా వ్యాప్తిపై సీఎస్ఐఆర్ సీరో సర్వే ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ధూమపానం ఆరోగ్యానికి హానీకరం అంటారు.. కానీ.. ఆ ధూమపానమే పొగరాయుళ్లను కరోనా నుంచి రక్షిస్తుందట!.

అవును.. పొగరాయుళ్లకు కరోనా సోకే ముప్పు చాలా తక్కువ అని సీఎస్ఐఆర్ సీరో సర్వేలో తేలిందట. కరోనా ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉంటుందనే అంశాన్ని తేల్చేందుకు సీరో సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా.. ధూమపానం, మద్యపానం, ఆహరపు అలవాట్లు, రక్త వర్గాలు.. వంటి అంశాల వారీగా 10,427 మంది నుంచి శాంపిల్స్ సేకరించారట. అలా సేకరించిన నమూనాలతో ఎవరికి కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందనే అంశంపై పరిశోధన చేశారు. దాంట్లో షాకింగ్‌గా.. ధూమపానం చేసేవారికి కరోనా ముప్పు చాలా తక్కువ ఉందని సర్వే తేల్చింది. ధూమపానం చేసే వారితో పాటు. శాకాహారులు, ఓ, ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న ప్రజలకూ కరోనా సోకే ప్రమాదం తక్కువగా ఉంటుందని సర్వేలో తేలిందంట. ఈ విషయాన్ని సీరో సర్వే తన నివేదికలో వెల్లడించింది.

Also read:

బ్రెజిల్‌లో కోవిడ్ సెకండ్ వేవ్, అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్లకు రెగ్యులేటర్ ఆమోదం, టీకామందు తీసుకున్న నర్సు

Thugs Hulchal in Tirumala: తిరుమలలో రెచ్చిపోయిన దొంగలు.. అలిపిరి నడక మార్గంలో చైన్ స్నాచింగ్‌కు యత్నం..