
Telangana Corona Update: తెలంగాణ కరోనా బులెటిన్ విడుదలైంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 41,246 నమూనాలు సేకరించి పరీక్షలు జరుపగా.. 379 కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,88,789కి చేరింది. ఇక 305 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. మొత్తంగా 2,82,177 మంది కరోనాను జయించారు. కరోనా కారణంగా బుధవారం నాడు ముగ్గురు మృత్యువాత పడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనాకు బలైన వారి సంఖ్య 1559కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53 శాతంగా ఉండగా, రికవరీ రేటు 97.71 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,053 యాక్టీవ్ కేసులు ఉండగా, వీరిలో 2,776 మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే.. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 71 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత.. మేడ్చల్ మల్కాజిగిరి 37, రంగారెడ్డి 36 కేసులతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
Also read: