తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 1,00,632 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 704 కొత్త కేసులు వెలగుచూశాయి. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,31,218కు చేరింది. 24 గంటల వ్యవధిలో ఐదుగురు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,725కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 917 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,16,769కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,724 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు కాళేశ్వరాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.
దేశంలో కరోనా కొత్త వేరియంట్ల వ్యాప్తి టెన్షన్ రేపుతోంది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో కప్పా వేరియంట్‌కు చెందిన మరో కేసు కలకలం రేపింది. దాంతో ఆ వేరియంట్ కేసులు మూడుకు చేరాయి. ‘ రాష్ట్రం నుంచి 72 నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఢిల్లీకి పంపాం. 30 శాంపిల్స్ ఫలితాలు అందాయి. వాటిలో 27 డెల్టా వేరియంట్, 2 డెల్టా ప్లస్, 1 కప్పా రకం కేసులు బయటపడ్డాయి’ అని బీఆర్‌డీ మెడికల్ కాలేజ్‌కె చెందిన డాక్టర్ అమరేశ్ సింగ్ వెల్లడించారు.
ఇప్పటికే దేశంలో డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు కలవరం పుట్టిస్తుండగా.. కొత్తగా కప్పా రకం ఆందోళన కలిగిస్తుంది. డెల్టా ప్లస్, కప్పా రకాలు రెండూ కూడా బి.1.617 వర్గానికి చెందినవే. ఈ రెండింటిని మొదట ఇండియాలోనే గుర్తించారు.
Also Read: అక్క భర్తతో ఎస్కేప్ అయిన యువతి.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన యువతి తండ్రి.