Telangana Corona: తెలంగాణలో కాస్త తగ్గిన కరోనా.. కొత్తగా 4,393మందికి పాజిటివ్, ఇద్దరు మృతి

|

Jan 22, 2022 | 8:01 PM

తెలంగాణలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. నిన్న 4,416 కేసులు రాగా.. ఇవాళ కాస్త తక్కువ కేసులు వచ్చాయి.

Telangana Corona: తెలంగాణలో కాస్త తగ్గిన కరోనా.. కొత్తగా 4,393మందికి పాజిటివ్, ఇద్దరు మృతి
Follow us on

Telangana Covid 19 Cases today updates: తెలంగాణలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. నిన్న 4,416 కేసులు రాగా.. ఇవాళ కాస్త తక్కువ కేసులు వచ్చాయి. రాష్ట్రంలో కొత్తగా 4,393 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకిన ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,31,212 కాగా, మరణాల సంఖ్య 4,071గా ఉంది. రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 6,95,942 ఉండగా, తాజాగా 2,319 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 95.18 శాతం ఉంది. ఇక ఐసోలేషన్‌లో 31,199 మంది ఉన్నట్లు తెలంగా వైద్య, ఆరోగ్య శాఖ శనివారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ఇక, ఇవాళ మొత్తం 1,16,224 శాంపిల్స పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 3,12,85,422 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు, ఇవాళ కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,643 మందికి మహమ్మారి సోకినట్లు తెలిపారు. తర్వత స్థానాల్లో మేడ్చెల్ జిల్లాలో 421 మంది, రంగారెడ్డి జిల్లాలో 286 మంది, హన్మకొండ జిల్లాలో 184, ఖమ్మం జిల్లాలో 128 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇక, మిగిలిన జిల్లాల్లో 100 లోపే కోవిడ్ కేసులు వెలుగు చూశాయి.

Telangana Corona

కరోనా, మరోవైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా కోవిడ్‌ నిబంధ‌న‌లు పాటిస్తే కేసుల సంఖ్యను తగ్గే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనాకు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తోడవడంతో అలజడి రేపుతోంది. ఇక, ఒమిక్రాన్ వేరియంట్ వలన ప్రాణాపాయం చాలా తక్కువని, ఒమిక్రాన్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖులను కూడా కేసులు వదలడం లేదు. హెల్త్ వర్కర్లు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కరోనా సోకుతుంది.
Read Also… Assembly Elections: 5 రాష్ట్రాల ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ర్యాలీల, రోడ్ షోపై ఆంక్షలు పొడిగింపు!