Omicron Alert: ఒమిక్రాన్ వేరియంట్ భయాలు.. తెలుగు రాష్ట్రాలు అలెర్ట్.. కీలక నిర్ణయాలు

|

Dec 11, 2021 | 11:48 AM

దేశంలో ఒమిక్రాజ్ వేరియంట్ విజృంభిస్తోంది. ఇప్పిటవరకూ దేశంలోని ఐదు రాష్ట్రాల్లో 32 కేసులు రికార్డయ్యయాయి. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయిలో అలెర్ట్ అయ్యాయి.

Omicron Alert: ఒమిక్రాన్ వేరియంట్ భయాలు.. తెలుగు రాష్ట్రాలు అలెర్ట్.. కీలక నిర్ణయాలు
Covid Omicron
Follow us on

Omicron Alert: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. ఇప్పిటవరకూ దేశంలోని ఐదు రాష్ట్రాల్లో 32 కేసులు రికార్డయ్యయాయి. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ సూచన మేరకు అన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయిలో అలెర్ట్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పటికే మాస్క్ మస్ట్ అనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఎవరైనా మాస్క్ వేసుకోకుండా బయటకు వస్తే రూ.1000 ఫైన్ వేస్తామని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. అటు మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో సరిహద్దు జిల్లాల అధికార యంత్రాంగాలను తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. తాజాగా AP కూడా కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ లేకుండా బయటకు వస్తే రూ.100 ఫైన్ వేయనున్నారు. ఇక మాస్క్ లేనివారిని షాపులోకి రానిస్తే.. 10వేల నుంచి 25 వేల వరకూ ఫైన్ విధిస్తామనీ దుకాణా యజమానులకు సూచించింది. ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది.

మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మళ్లీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఊపందుకుంది. అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి. బయటకు వచ్చేటప్పుడు వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలంటూ నిబంధనలు విధిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులేవీ నిర్థారణ కాకపోవడం కాస్త ఊరట కలిగించే అవకాశం.

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు లేవు..

తెలంగాణలో ఇప్పటి వరకు ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాలేదని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఏ వైరస్‌ వచ్చినా మాస్కే శ్రీరామ రక్ష అని చెప్పారు. అందరూ మాస్కులు ధరించాలని.. వ్యాక్సినేషన్‌కు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బస్తీ దవాఖానాల్లోనూ వ్యాక్సినేషన్‌ను ఉచితంగా అందిస్తున్నామన్నారు మంత్రి హరీష్‌రావు.

మాస్క్ తప్పనిసరిగా వాడాలి..

ఒమిక్రాన్ చాపకింద నీరులో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌ను తప్పనిసరిగా వాడాలని టీవీ9 కోరుతోంది. అలాగే తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి కోవిడ్ నివారణ చర్యలను తప్పనిసరిగా పాటించాలి. అపోహల కారణంగా ఇంకా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వారు.. వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలి.

కోవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే ఎక్కువ అయితే జిల్లా స్థాయిలో ఆంక్షలు విధించాల్సి ఉంటుందని ఐసీఎంఆర్ హెచ్చరించడం తెలిసిందే. ఆ మేరకు అన్ని రాష్ట్రాలకు సందేశం పంపింది. ఒమిక్రాన్ బారినపడిన వారిలో అందరిలో వ్యాధి లక్షణాలు స్వల్పంగానే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

Also Read..

Pushpa Item Song: పుష్ప ఐటమ్ సాంగ్.. ఆ పాటను కాపీ చేశారా ?.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Omicron Threat: చాపకింద నీరులా విస్తరిస్తున్న ఒమిక్రాన్.. మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం