శేషాచలం అడువుల్లో ఎర్రదొంగల అలజడి

నిశబ్ధంగా ఉన్న తిరుపతి శేషాచల అడవుల్లో స్మగ్లర్ల అలజడి మళ్లీ మొదలైంది. తాజాగా శేషాచలం అడవులు, శ్రీవారి మెట్టు, బాక్రాపేట ఘాట్‌, ఎర్రావారి పాలెంలో స్మగ్లర్లు సంచరిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. స్మగ్లర్లు వాకీటాకీలు, ఆయుధాలతో తిరుగుతున్నారని తెలవడంతో … వారిని పట్టుకోవడానికి రెండు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు రంగంలోకి దిగాయి. లాక్‌డౌన్ సమయంలో మూడునెలల కనిపించని ఎర్ర దొంగలు శేషచలం అడవుల్లోకి ఎంట్రీ ఇచ్చారని తెలిసి అడవు మొత్తం జల్లెడ పడుతున్నారు. అడవిలో సగం […]

శేషాచలం అడువుల్లో ఎర్రదొంగల అలజడి

Updated on: Jun 20, 2020 | 1:33 PM

నిశబ్ధంగా ఉన్న తిరుపతి శేషాచల అడవుల్లో స్మగ్లర్ల అలజడి మళ్లీ మొదలైంది. తాజాగా శేషాచలం అడవులు, శ్రీవారి మెట్టు, బాక్రాపేట ఘాట్‌, ఎర్రావారి పాలెంలో స్మగ్లర్లు సంచరిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. స్మగ్లర్లు వాకీటాకీలు, ఆయుధాలతో తిరుగుతున్నారని తెలవడంతో … వారిని పట్టుకోవడానికి రెండు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు రంగంలోకి దిగాయి.

లాక్‌డౌన్ సమయంలో మూడునెలల కనిపించని ఎర్ర దొంగలు శేషచలం అడవుల్లోకి ఎంట్రీ ఇచ్చారని తెలిసి అడవు మొత్తం జల్లెడ పడుతున్నారు. అడవిలో సగం కాలిన ఎర్రదుంగలను గమనించిన పోలీసులు సమీప ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో అటు తమిళనాడు నుంచి శేషాచలం అడవుల్లోకి వచ్చి వుంటారని అనుమానిస్తున్నారు.  స్మగ్లర్లు రాత్రి సమయంలో ఒక చోట అడవి పందిని చంపి కాల్చుకు తిన్నరని అధికారులు గుర్తించారు.

Follow Us