తమిళనాడులో 3 లక్షలకు చేరువలో పాజిటివ్‌ కేసులు

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 5,994 కరోనా..

తమిళనాడులో 3 లక్షలకు చేరువలో పాజిటివ్‌ కేసులు

Updated on: Aug 10, 2020 | 4:35 AM

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 5,994 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,901కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 2,38,638 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 53,336 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 4,927 మంది మరణించారు.

Read More :

కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములుకు కరోనా

మహారాష్ట్రలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

Loading...
Unable to load recommendations.
Follow Us