
తమిళనాడులో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజాప్రతినిధులపై, అధికారులపై కూడా ఈ వైరస్ ప్రభావం చూపిస్తోంది. తమిళనాడులో ఇప్పటికే కరోనా బారిన పడి డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే తాజాగా కరోనా వైరస్‌తో తమిళనాడు సీఎం పీఏ మృతి చెందారు. తమిళనాడు సీఎం పళని స్వామి పీఏ దామోదరం ఇవాళ కోవిడ్‌తో మృతి చెందినట్లు ఆ రాష్ట్ర అధికారులు పేర్కొన్నారు.
కాగా ఇండియాలో కరోనావైరస్ వీరవిహారం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,974 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,54,065కి చేరింది. కాగా కరోనా మరణాలు సంఖ్య కలవరపెడుతోంది. నిన్న ఒక్కరోజే 2003 మంది కోవిడ్-19 కారణంగా చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 11,903కి చేరింది. డెత్ రేటు 2.9 శాతం నుంచి 3.4 శాతానికి పెరగడం గమనార్హం. కాగా వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,86,934గా ఉంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 1,55,227 ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ 4వ ప్లేసులో ఉంది.
Read More:
బ్రేకింగ్: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల..
షాకింగ్: ప్రతీ ఐదుగురిలో ఒకరికి కరోనా ముప్పు.. నిపుణుల రిపోర్ట్