తమిళనాడు కరోనా అప్డేట్స్‌.. 4244 పాజిటివ్ కేసులు,68 మరణాలు..

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఓ వైపు కరోనా..

తమిళనాడు కరోనా అప్డేట్స్‌.. 4244 పాజిటివ్ కేసులు,68 మరణాలు..

Edited By:

Updated on: Jul 12, 2020 | 6:53 PM

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఓ వైపు కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు.. కరోనా బారినపడి మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా ఆదివారం నాడు కొత్తగా మరో 4,244 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,38,470కి చేరింది. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 68 మంది మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారినపడి 1,966 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 46,969 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు.