తమిళనాడులో కొత్తగా మరో 3,756 కేసులు.. 64 మరణాలు..

| Edited By:

Jul 08, 2020 | 6:58 PM

తమిళనాడులో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా..

తమిళనాడులో కొత్తగా మరో 3,756 కేసులు.. 64 మరణాలు..
Follow us on

తమిళనాడులో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా బుధవారం నాడు కొత్తగా మరో 3,756 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,22,350కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 46,480 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా చెన్నై నగరంలోనే నమోదవుతున్నాయి. దీంతో చెన్నై నగరంలోని ప్రజలు కరోనా భయంతో వణికిపోతున్నారు. కరోనా కట్టడి చేసేందుకు టెస్టుల సంఖ్యను రోజురోజుకు పెంచుతోంది.

కాగా, దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలోనే నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో ఈ మూడు రాష్ట్రాల్లోనే యాభై శాతం ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కరోనా కట్టడి కోసం.. పరీక్షల కెపాసిటిని మరింత పెంచాయి.