తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా చెన్నై నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అత్యధికంగా ఉంది. దేశంలో మహారాష్ట్ర తర్వాత.. తమిళనాడులోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా శనివారం నాడు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో 4,280 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,001కి చేరింది. ఇక కరోనా బారినపడి ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,450 మంది మరణించారు. వీటిలో ఒక్క చెన్నై నగరంలోనే వెయ్యి మందికి పైగా మరణించారు. ఇప్పటి వరకు చెన్నైలో 66వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం నాడు చెన్నైలో కొత్తగా 1,842 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 65 మంది మరణించారు. ఈ విషయాన్ని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కాగా, దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ తయారీ చేస్తున్న సంస్థలకు వేగం పెంచాలని సూచించింది. ఇప్పటికే ఆగస్ట్ 15 వరకు భారత్ బయోటెక్ సంస్థ వ్యాక్సిన్ కనుగొనేందుకు హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌కు రంగం సిద్ధం కూడా చేసింది. ఇందుకు ఐసీఎంఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Tamil Nadu reported 4,280 fresh COVID-19 cases and 65 deaths today, taking total cases to 1,07,001 and death toll to 1,450. Number of active cases stands at 44,956: State Health Department pic.twitter.com/Tnpdev9fkk
— ANI (@ANI) July 4, 2020