తమిళనాడులో కరోనా విజృంభన.. కొత్తగా మరో 4,965..

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. తాజాగా మంగళవారం నాడు కొత్తగా మరో 4,965 కరోనా పాజిటివ్ కేసులు..

తమిళనాడులో కరోనా విజృంభన.. కొత్తగా మరో 4,965..

Updated on: Jul 21, 2020 | 6:56 PM

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. తాజాగా మంగళవారం నాడు కొత్తగా మరో 4,965 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,80,643కి చేరింది. ఈ విషయాన్ని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 75 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి రాష్ట్ర వ్యాప్తంగా 2,626 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 51,344 యాక్టివ్ కేసులు న్నాయని అధికారులు తెలిపారు. ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా చెన్నై నగరంలోనే నమోదవుతున్నాయి. ఇప్పటికే చెన్నైలో 88వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కట్టడి కోసం అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us