
తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే 64 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం నాడు కొత్తగా మరో 2,516 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంత ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 64,603కి చేరింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారి పడి 833 మంది మరణించారు. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒక్క చెన్నై నగరంలోనే 44వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయని.. మంగళవారం నాడు 1,380 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. చెన్నై నగరంలో ఇప్పటి వరకు 44,205 కరోనా కేసులు నమోదయ్యాయన్నారు. గడిచిన 24 గంటల్లో 39 మంది కరోనా బారినపడి మరణించారని తెలిపారు.
Tamil Nadu reports 2,516 new cases, 1,227 discharges, and 39 deaths today. Total number of cases stands at 64,603 and death toll is at 833: State Health Department. pic.twitter.com/Uh82kF7ZOY
— ANI (@ANI) June 23, 2020