Banwarilal Purohit: చలించిన గవర్నర్.. వీధికుక్కలకు ఆహారం అందించేందుకు రూ.10 లక్షలు అందజేత

|

May 29, 2021 | 8:48 AM

Tamil Nadu Governor: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్ర గవర్నర్ భన్వారిలాల్ పురోహిత్ కీలక నిర్ణయం

Banwarilal Purohit: చలించిన గవర్నర్.. వీధికుక్కలకు ఆహారం అందించేందుకు రూ.10 లక్షలు అందజేత
Banwarilal Purohit
Follow us on

Tamil Nadu Governor: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్ర గవర్నర్ భన్వారిలాల్ పురోహిత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్ సమయంలో కుక్కలకు ఆహారం అందించడానికి గవర్నర్ భన్వారిలాల్ పురోహిత్ రూ.10లక్షలు మంజూరు చేశారు. లాక్ డౌన్ సమయంలో వీధి కుక్కలకు ఆహార కొరత ఏర్పడిందని దినపత్రికల్లో వచ్చిన వార్తలు చూసిన గవర్నర్ చలించిపోయి ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ వల్ల కుక్కలకు ఆహారం లేక అలమటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ పురోహిత్ .. కుక్కలకు ఆహారం అందించేందుకు తన విచక్షణ గ్రాంటు నుంచి రూ.10లక్షలను జంతు సంక్షేమ బోర్డుకు అందజేశారు.

ఈ మేరకు గవర్నర్ పురోహిత్ శుక్రవారం తమిళనాడు పశుసంవర్ధక, పాడి, మత్స్య శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి టీఎస్ జవహర్‌కు ఆయన చెక్కును అందించి పలు సూచనలు చేశారు. లాక్‌డౌన్ సందర్భంగా జంతువుల సంక్షేమం గురించి పరిశీలించాలని.. దీంతోపాటు సాయం అందించాలని గవర్నర్ స్వచ్ఛంద సంస్థలకు విజ్ఞప్తి చేశారు. కరోనావైరస్‌ను కట్టడి చేసేందుకు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, వ్యాక్సిన్ వేయించుకోవాలని తమిళనాడు ప్రజలకు గవర్నర్ పురోహిత్ ఈ సందర్భంగా కోరారు.

Also Read:

Marriage Ceremony: పెళ్లి మండపంపై తెగిపడిన విద్యుత్ తీగలు.. నలుగురు మృతి.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు..

Sexual Harassment: కామర్స్ టీచర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఒకరు కాదు, ఇద్దరు కాదు 500 మంది విద్యార్థినిలపై..