AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేటిఎంని కూడా బ్యాన్ చేయండి..

గాల్వాన్ లోయలో చైనాతో ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ అంశం తర్వాత చైనాపై మరోసారి వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. దీంతో 'బాయ్‌కాట్ చైనా' అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్‌ని..

పేటిఎంని కూడా బ్యాన్ చేయండి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 30, 2020 | 6:11 PM

Share

గాల్వాన్ లోయలో చైనాతో ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ అంశం తర్వాత చైనాపై మరోసారి వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. దీంతో ‘బాయ్‌కాట్ చైనా’ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్‌ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం కీలక ప్రకటన చేసింది. అలాగే ఈ క్రమంలో పేటీఎం యాప్‌ని కూడా బ్యాన్ చేయమని తమిళ కాంగ్రెస్ ఎంపీ మనికమ్ ఠాగూర్ డిమాండ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘చైనా యాప్స్‌ను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. అలాగే పేటీఎంని కూడా బ్యాన్ చేసి ప్రధాని నరేంద్ర మోదీ తన 56 అంగుళాల ఛాతీని, ధైర్యాన్ని ప్రదర్శించాలి. మీరేమో ‘గో వోకల్ ఫర్ లోకల్’ అంటున్నారు కానీ.. వాటికి పెట్టుబడులు ఎలా వస్తున్నాయి?” అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు ఎంపీ. అలాగే పేటీఎంలో చైనాకు చెందిన యాంట్ ఫైనాన్షియల్స్, అలీబాబా గ్రూపులు వరుసగా 29.71 శాతం, 7.18 శాతం పెట్టుబడులు పెట్టాయని, ఇలాంటి వాటిని నిషేధించాలని ఎంపీ మనికమ్ ఠాగూర్ ప్రధానిని కోరారు.

కాగా ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీ చేసిన ఈ ట్వీట్ పెద్ద దుమారం సృష్టిస్తోంది. పేటీఎం యాప్ చైనా యాప్ కాదని, దేశీయ యాప్ అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..