కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు వ్యంగ్యాస్త్రం

|

May 25, 2020 | 4:45 PM

కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్ఇండియా విమానాల్లో మిడిల్ సీట్ల బుకింగ్‌పై నిబంధనలు ఉల్లంఘిస్తోందని మండిపడింది. అది విమానమని కరోనా వైరస్‌కి ఏమైనా తెలుస్తుందా.. అని సెటైర్ వేసింది. జూన్ 6 తర్వాత మిడిల్ సీట్లను ఖాళీగా ఉంచాలని ఆదేశించింది. వందేభారత్ మిషన్‌లో భాగంగా మిడిల్ సీట్లను బుక్ చేయడంపై సుప్రీం ధర్మాసనం ఫైర్ అయ్యింది. మిడిల్ సీట్ల బుకింగ్‌పై గతంలో ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు […]

కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు వ్యంగ్యాస్త్రం
Follow us on

కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్ఇండియా విమానాల్లో మిడిల్ సీట్ల బుకింగ్‌పై నిబంధనలు ఉల్లంఘిస్తోందని మండిపడింది. అది విమానమని కరోనా వైరస్‌కి ఏమైనా తెలుస్తుందా.. అని సెటైర్ వేసింది. జూన్ 6 తర్వాత మిడిల్ సీట్లను ఖాళీగా ఉంచాలని ఆదేశించింది. వందేభారత్ మిషన్‌లో భాగంగా మిడిల్ సీట్లను బుక్ చేయడంపై సుప్రీం ధర్మాసనం ఫైర్ అయ్యింది. మిడిల్ సీట్ల బుకింగ్‌పై గతంలో ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లింది ఎయిర్ ఇండియా. అయితే అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది. ముంబై కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఎయిర్ ఇండియా పిటిషన్‌ను కొట్టివేసింది.