Cyril Ramaphosa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసాకు కరోనా పాజిటివ్.. అధికారుల్లో ఆందోళన!

|

Dec 13, 2021 | 9:28 AM

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసాకు (Cyril Ramaphosa) కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలతో ఉన్న ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని సౌతాఫ్రికా అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Cyril Ramaphosa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసాకు కరోనా పాజిటివ్.. అధికారుల్లో ఆందోళన!
South African President
Follow us on

South African President test Covid 19: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసాకు (Cyril Ramaphosa) కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలతో ఉన్న ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని సౌతాఫ్రికా అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణాఫ్రికాలో తొలిసారిగా వెలుగు చూసిన కరోనా నూతన వేరియంట్‌ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నవేళ స్వయంగా ఆ దేశాధ్యక్షుడికి కరోనా సోకడం గమనార్హం.

రమాఫోసా అనారోగ్యంతో బాధపడటంతో ఆయనకు COVID 19 పరీక్ష చేయించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు. అతను కేప్ టౌన్‌లో స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దక్షిణాఫ్రికా మిలిటరీ హెల్త్ సర్వీస్ పర్యవేక్షిస్తున్నట్లు ప్రకటన తెలిపింది. కాగా, వారం రోజుల పాటు డిప్యూటీ ప్రెసిడెంట్ డేవిడ్ మబుజాకు అన్ని బాధ్యతలను అప్పగించారు.అయితే, అతను ఓమిక్రాన్ కరోనావైరస్ వేరియంట్‌తో బారిన పడ్డాడో లేదో ప్రకటనలో చెప్పలేదు.

రామఫోసా వయసు 69 సంవత్సరాలు. గత వారం, రామఫోసా నాలుగు పశ్చిమ ఆఫ్రికా దేశాలను సందర్శించారు. రామపోసో ఇటీవలే నైజీరియా వెళ్లివచ్చారని, డిసెంబర్‌ 8న సెనెగల్‌ నుంచి వచ్చిన తర్వాత పరీక్షలు చేయగా ఆయనకు నెగెటివ్‌ వచ్చిందని వెల్లడించారు. పర్యటనలో ప్రతి దేశంలో అతను వివిధ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. కాగా, రామఫోసాకు కరోనా నిర్ధారణ కావడంతో ఆయనతో భేటీ అయిన వారందరూ COVID 19 నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. కాగా, ప్రతినిధి బృందంలోని కొందరు నైజీరియాలో పాజిటివ్ గా తేలడంతో నేరుగా దక్షిణాఫ్రికాకు తిరిగి వచ్చారు.

రామఫోసో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నారు. అయితే ఆదివారం ఆయన స్వల్ప అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు నిర్వహించామని, అందులో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కేప్​టౌన్‌లో ఐసోలేషన్‌లో ఉన్నారని, వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కాగా, దక్షిణాఫ్రికాలో నిన్న ఒక్కరోజే 17,154 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 7861 ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి.

Read Also… Khiladi Movie: శరవేగంగా షూటింగ్ జరుపుంటున్న మాస్ మహారాజా సినిమా.. “ఖిలాడి” రిలీజ్ ఎప్పుడంటే..