కరోనా మహమ్మారి మనుషుల్లో బంధాలను బంధుత్వాలను పలచన చేస్తుంది. సొంతవారిని కూడా దగ్గరకు రాకుండా భయపెడుతుంది. మృతదేహాలను చూసేందుకు కూడా భయపడేలా చేస్తుంది. బంధువులు ఎందరు ఉన్నా కొందరు కరోనా బాధితులు అనాథలుగా మిగిలిపోతున్నారు. ఎవరు దగ్గరికి రాకపోవడంతో కరోనాతో చనిపోయినవారికి మానవత్వం కలిగిన వారు అంత్యక్రియలు చేస్తున్నారు. తాజాగా కృష్ణాజిల్లాలో మానవత్వం మంట కలిసిన సంఘటన వెలుగు చూసింది. మచిలీపట్నం మాచవరానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి కరోనా సోకడంతో పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీంతో అతని కొడుకు ప్రసాద్ అంత్యక్రియలతో తనకేమి సంబంధంలేదని చేతులేత్తేశారు. పైగా మృతదేహన్ని వదిలేసి వెళ్లిపోయాడు. మంత్రి పేర్నినానికి విషయం తెలిసింది. ప్రసాద్ అంత్యక్రియలపై మంత్రి స్పందించారు. దహన సంస్కారాలకు అవసరమైన ఆర్ధిక సహాయం అందజేశారు. దీంతో ప్రసాద్ భార్య నాగమణి భర్తకు తలకొరివి పెట్టి దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఇలాంటి ఘటనలు ఒకటి కాదు, రెండు కాదు.. దేశవ్యాప్తంగా నిత్యం అనేకం వెలుగుచూస్తున్నాయి. మనుషుల్లోని విలువల్ని, మానవత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి
Also Read: బెజవాడలో కిలాడీ లేడీ.. మాయ చేసి.. ముంచేస్తుంది…