Maoists Effected Corona: సెకండ్ వేవ్‌తో దేశాన్ని వణికిస్తోన్న కరోనా.. దండకారణ్యంలోనూ దడ పుట్టిస్తోందా?.. మావోయిస్టులకు మాయరోగం!

|

Jun 02, 2021 | 5:07 PM

చత్తీస్‌గఢ్‌లోని దక్షిణి బస్తర్‌ అడవుల్లో కరోనాతో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ ఇటీవల తెలిపారు. పోలీసుల ప్రకటనలు నిజమే అని చెబుతున్నాయి తాజా పరిస్థితులు.

Maoists Effected Corona: సెకండ్ వేవ్‌తో దేశాన్ని వణికిస్తోన్న కరోనా.. దండకారణ్యంలోనూ దడ పుట్టిస్తోందా?.. మావోయిస్టులకు మాయరోగం!
Senior Maoists Undergoing Treatment For Covid 19
Follow us on

Senior Maoists undergoing Covid Treatment: క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని తీవ్రంగా అత‌లాకుతలం చేస్తోంది. ఫస్ట్ వేవ్‌తో పోల్చితే రెండో వేవ్‌లో మ‌ర‌ణాలు, కేసుల సంఖ్య విప‌రీతంగా న‌మోద‌వుతున్నాయి. యావ‌త్ దేశం వైరస్ ధాటికి చిగురుటాకులా వ‌ణికిపోతోంది. ఇదే క్రమంలోనే సెకండ్ వేవ్ ఇంకా ముగియ‌క ముందే థ‌ర్డ్ వేవ్ భ‌య‌పెట్టిస్తోంది. అయితే, జనారణ్యంలో వారితో పాటు దండకారణ్యంలో ఉన్నవారు సైతం కరోనా వైరస్ కాటు గురవుతున్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు పల్లె ప్రాంతాలు, ముఖ్యంగా ఆడవుల్లో ఉన్నవారు సైతం కరోనా మహహ్మరి బారినపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే చత్తీస్‌గఢ్‌లోని దక్షిణి బస్తర్‌ అడవుల్లో కరోనాతో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ ఇటీవల తెలిపారు. పోలీసుల ప్రకటనలు నిజమే అని చెబుతున్నాయి తాజా పరిస్థితులు. కరోనా చికిత్స కోసం వచ్చి బయటకు వచ్చి వరంగల్‌లోని మట్టెవాడ పోలీసులకు చిక్కాడు మావోయిస్టు నేత గడ్డం మధుకర్. ఆయనతో పాటు ఓ కొరియర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

భద్రతా సిబ్బందికి చిక్కిన మావోయిస్టుల్ని విచారించిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. మావోయిస్ట్ అగ్రనాయకత్వం అంతా వైరస్ కోరల్లో చిక్కుకున్నట్లు తేలింది. 12 మంది కీలక నేతలకు కరోనా సోకినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సీపీ తరుణ్ జోషి తెలిపారు. కోవిడ్‌తో బాధ పడుతున్న మావోయిస్టు నేతల పేర్లు కూడా ప్రకటించారు. దక్షిణి బస్తర్‌ అడవుల్లో కరోనాతో 10 మంది మావోయిస్టులు మరణించారని.. వంద మందికి పైగా వైరస్ బారిన పడినట్లు తమ వద్ద సమాచారం ఉందని.. ఇటీవలే దంతెవాడ ఎస్పీ ప్రకటించారు.

కుంట, డోర్నపాల్‌ ప్రాంతాల్లో మావోయిస్టులు కరోనా వ్యాక్సిన్‌లతో పాటు దానికి సంబంధించిన ఔషధాలను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. కరోనా సోకిన మావోయిస్టులకు ఉచితంగా వైద్య అందిస్తామని.. చికిత్స కోసం మావోయిస్టులు సమీప పోలీస్ స్టేషన్‌కు రావచ్చని ఎస్పీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆహారం తీసుకెళ్లే కొరియర్ల ద్వారా మావోయిస్టులకు కోవిడ్ సోకి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మైదాన ప్రాంతాలకు వచ్చిన మావోయిస్టు నేతల నుంచి దళాల్లో కరోనా సోకినట్లు మరో అనుమానం. కరోనా సోకిన వారిలో మోస్ట్‌వాంటెడ్‌ మావోయిస్టు నేతలు ఉన్నట్లు సమాచారం.

Read Also…  AP Corona Cases: ఏపీలో ఇవాళ కాస్త పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 12,768 మందికి పాజిటివ్, 98 మంది మృతి