కరోనాకు చెక్ పెట్టాలంటే.. మరో రెండేళ్లు సామాజిక దూరం పాటించక తప్పదు !

భయంకర కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలనుకుంటే మరో రెండేళ్లు.. అంటే 2022 వరకు ప్రజలు సామాజిక దూరాన్ని పాటించక తప్పదని హార్వర్డ్ యూనివర్సిటీ తెలిపింది. కొత్త ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండాలంటే ఇది తప్పనిసరి అని సూచించింది.

కరోనాకు చెక్ పెట్టాలంటే.. మరో రెండేళ్లు సామాజిక దూరం పాటించక తప్పదు !

Edited By:

Updated on: Apr 15, 2020 | 4:38 PM

భయంకర కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలనుకుంటే మరో రెండేళ్లు.. అంటే 2022 వరకు ప్రజలు సామాజిక దూరాన్ని పాటించక తప్పదని హార్వర్డ్ యూనివర్సిటీ తెలిపింది. కొత్త ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండాలంటే ఇది తప్పనిసరి అని సూచించింది. సోషల్ డిస్టెన్స్ కి సంబంధించిన ఆంక్షలను ఒక్కసారిగా ఎత్తివేసిన పక్షంలో.. వైరస్ వ్యాప్తిలో కొంతవరకు జాప్యం జరిగినా..ఇన్ఫెక్షన్లు మాత్రం తీవ్రంగా ఉంటాయని ఈ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో తెలిపారు. ఈ స్టడీ ఫలితాలను సైన్స్ జర్నల్ లో ప్రచురించారు. ప్రస్తుతం పాటిస్తున్న సామాజిక దూర ఆంక్షలు సరైనవే అయినప్పటికీ.. వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టాలంటే ఇవి చాలవని రీసెర్చర్లు అభిప్రాయపడ్డారు. ఇన్ ఫ్లుయెంజా మాదిరే ఇది కూడా సీజనల్ వ్యాధి కావచ్ఛునని వారు హెచ్ఛరించారు. సార్స్-కోవ్-1 అదుపునకు తీసుకున్న చర్యలు మంచి ఫలితాలే ఇచ్చి ఉండవచ్ఛునని, కానీ సార్స్-కోవ్-2 విషయంలో మాత్రం మరిన్ని చర్యలు తీసుకోవలసిందేనని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు సూ చించారు.