మీరు సరిగ్గా నిద్రపోవటం లేదా? అయితే కరోనా దాడిని తట్టుకోలేం!

| Edited By:

May 06, 2020 | 2:33 PM

కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. ఇది పుట్టి నెలలు గడుస్తున్నా.. సైంటిస్టులకు పూర్తి వివరాలు అంతుచిక్కకపోవడంతో వ్యాక్సిన్ తయారీ కావడం లేదు. ఎప్పటికప్పుడు జన్యుపరంగా వైరస్ మారుతూ ఉండటంతో..

మీరు సరిగ్గా నిద్రపోవటం లేదా? అయితే కరోనా దాడిని తట్టుకోలేం!
Follow us on

కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. ఇది పుట్టి నెలలు గడుస్తున్నా.. సైంటిస్టులకు పూర్తి వివరాలు అంతుచిక్కకపోవడంతో వ్యాక్సిన్ తయారీ కావడం లేదు. ఎప్పటికప్పుడు జన్యుపరంగా వైరస్ మారుతూ ఉండటంతో వ్యాక్సిన్ తయారీకి కష్టంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవేళ కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టినా అది సక్రమంగా పని చేస్తుందని చెప్పలేమంటున్నారు. అయితే సరిగ్గా నిద్రపోక పోయినా.. కరోనాను తట్టుకోలేమని అమెరికాలోని జాతీయ ఆరోగ్య సంస్థ ఓ ఇంటర్నేషనల్ మీటింగ్ ఏర్పాటు చేసి వెల్లడించింది.

మానవ శరీర నిర్మాణం బయటి నుంచి దాడి చేసే మైక్రోబ్స్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటుంది. శరీరానికి కవచంలా బిగుతుగా ఉండి చర్మంపై బ్యాక్టీరియా, వైరస్ లాంటివి రాకుండా కాపాడుతుంటాయి. బయట నుంచి దాడి చేయడానికి వీలు ఉండదు కాబట్టి.. ఈ వైరస్.. కళ్లు, ముక్కు, నోరు ద్వారా మైక్రోబ్స్ రూపంలో శరీరంలోకి చొరబడతాయి. సాధారణమైనంత వరకూ శరీరంలోకి ఏదైనా వైరస్ ప్రవేశిస్తే.. రక్తంలోని యాంటీ బాడీస్ గుర్తించి చంపేస్తాయి.

అయితే వీటి శక్తికి మించి వైరస్ అటాక్‌ చేస్తేనే మనిషి అనారోగ్యానికి గురవుతాడు. మనిషి శరీరాన్ని కాపాడటానికి చర్మంతో పాటు శరీర భాగాలు సరిగ్గా పని చేయాలంటే బయోలాజికల్ క్లాక్ కరెక్ట్‌గా పని చేయాలి. అది సరిగ్గా పని చేయాలంటే.. శరీరానికి సరిపడా నిద్ర తప్పనిసరిగా కావాలి. అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ నిపులను సైతం ఇదే తెలియజేస్తున్నారు. వేళకు తినడం, నిద్రపోవడం చాలా అవసరం. కాగా కరోనాను ఎదుర్కోవడంలో నిద్ర కూడా ఒక భాగం కాబట్టి.. సరైన వేళలకు నిద్రపోండి.. వైరస్‌పై పోరాటం చేయండి.

Read More:

టీవీ సీరియల్స్ షూటింగ్‌లకు అనుమతిచ్చిన కర్నాటక ప్రభుత్వం

బ్రాహ్ముణులను కించపరిచిందని.. యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు..

తెలంగాణలో వైన్ షాపులకు క్లియర్