
మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా బుధవారం ట్వీట్‌లో మరో గుడ్‌న్యూస్ చెప్పారు. మేఘాలయ రాష్ట్రంలోని ఇండెక్స్ పేషెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ పదహారు మందికి మరోసారి కరోనా టెస్టులు చేశారు. అయితే ఈ రిపోర్టుల్లో అందరికీ కరోనా నెగిటివ్ వచ్చినట్లు సీఎం సంగ్మా బుధవారం ప్రకటించారు.
తన ట్వీట్‌లో ఇండెక్స్ పేషెంట్ ఫ్యామిలీలోని మొత్తం 16 మంది సభ్యులకు కరోనా టెస్టులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అందరికీ కరోనా నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన మరో 8 మందికి కూడా కరోనా టెస్టులు నిర్వహించగా.. వారికి కూడా నెగిటివ్ అని తేలిందని తెలిపారు. అయితే ఈ ఎనిమిది మందికి మరోసారి కూడా టెస్టులు చేపడతామని.. అప్పుడు కూడా కరోనా నెగిటివ్ వస్తే.. వారంతా కరోనా నుంచి కోలుకున్నట్లు ప్రకటిస్తామని తెలిపారు.
16 family members of the index patient were tested again, including the 8 who were positive. Their test results came in today and they have all tested negative. 8 positive cases will need to be tested again after 24 hours as per protocol to completely declare them as recovered.
— Conrad Sangma (@SangmaConrad) April 29, 2020