ఫుట్‌బాల్‌ ఆడిన కరోనా పేషెంట్స్‌.. కేసు నమోదు చేసిన పోలీసులు..

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పద్నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అందులో..

ఫుట్‌బాల్‌ ఆడిన కరోనా పేషెంట్స్‌.. కేసు నమోదు చేసిన పోలీసులు..

Edited By:

Updated on: Jul 28, 2020 | 9:52 AM

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పద్నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అందులో మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇక కరోనా సోకిన రోగులను ఐసోలేషన్ వార్డులో ఉంచగా.. వారిలో కొందరు ఆటపాలటలతో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా మహరాష్ట్రలోని కోల్హాపూర్‌ పట్టణంలోని ఐసోలేషన్‌ వార్డులో కరోనా సోకిన పేషెంట్స్‌ ఫుట్‌ బాల్‌ ఆడుతూ ఎంజాయి చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే అందులో ఎవరు కూడా మాస్క్‌ పెట్టుకోకుండా.. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఈ ఘటనపై జిల్లా అధికారులు సీరియస్ అయ్యారు. మాస్క్‌ లేకుండా ఇలాంటి వేశాలేంటంటూ.. ఆరుగురు కరోనా రోగులపై కేసులు నమోదు చేశారు.