Coronavirus Pandemic: కరోనా నియంత్ర కోసం అంటూ సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్స్ ధర పెంపు .. ఎంతమేర అంటే..

|

Apr 12, 2021 | 9:44 PM

Coronavirus Pandemic: గత ఏడాది జనవరిలో మనదేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. కేరళలో మొదటి కేసు నమోదయ్యింది. అప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై...

Coronavirus Pandemic: కరోనా నియంత్ర కోసం అంటూ సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్స్ ధర పెంపు .. ఎంతమేర అంటే..
Platform Ticket Price
Follow us on

Coronavirus Pandemic: గత ఏడాది జనవరిలో మనదేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. కేరళలో మొదటి కేసు నమోదయ్యింది. అప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై కరోనా వైరస్ నివారణ కోసం చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది మార్చి 22 నుంచికేంద్రం ప్రభుత్వం లాక్ డౌన్ కూడా విధించింది. అనంతరం అంచెలంచెలుగా లాక్ డౌన్ ను సడలించింది. ఓ వైపు కరోనా నివారణ కోసం వ్యాక్సిన్ షన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుతాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం టీకా కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వహిస్తుంది. అయితే మరోవైపు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సూచిస్తుంది.

అయితే గత ఏడాది చివరి నుంచి ప్రజలు మాస్కులకు దూరంగా ఉంటున్నారు.. ఇక దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, లతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. దీంతో మహారాష్ట్ర లో లాక్ డౌన్.. రాత్రి వేళల్లో కర్ఫ్యూ వంటి చర్యలు చేపట్టింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా వ్యాప్తికి చెక్ పెట్టడానికి రంగంలోకి దిగింది. ఇప్పటికే మాస్కులు లేకుండా రోడ్డు మీదకు వచ్చినా.. బస్సుల్లో రద్దీ ప్రదేశాల్లో కనిపించినా వెయ్యి రూపాయల ఫైన్ వేయనున్నామని ప్రకటించింది. అంతేకాదు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని సిపి సజ్జనార్ హెచ్చరించారు. తాజాగా మరో అడుగు ముందుకు వేసి.. కరోన కట్టడి కోసం మరికొన్ని చర్యలు చేపట్టింది. అందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీ ని నియంత్రించేందుకు ప్లాట్ ఫార్మ్ టికెట్స్ ధరలను పెంచింది. మంగళవారం (ఏప్రిల్ 13 ) నుంచి ఈ పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకూ రూ 30 ఉన్న ప్లాట్ ఫామ్ టికెట్ ధర రూ. 50 లకు పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పెంచిన ధరలు ఉగాది రోజునుంచి అమల్లోకి రానున్నాయని తెలిపారు.

Also Read: ముఖం, గెడ్డం దగ్గర కొవ్వు పేరుకుందా.. సింపుల్ చిట్కాలను ఫాలోకండి

రోబో టెక్నాలజీ మహాభారతంలోనే ఉందా.. బార్బరీక్ ఎవరో తెలుసా..కృష్ణుడు ఎందుకు చంపాడంటే..!