Covid 19 effect on children: కరోనా సోకిన కొందరు పిల్లల్లో పీడియాట్రిక్ ఇన్‌ఫ్లమేటరీ మల్టీసిస్టమ్ సిండ్రోమ్(పీఐఎంఎస్-టీఎస్) అనే అరుదైన సమస్య వస్తోందని లండన్‌లోని కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా సోకిన పిల్లల్లో రోగ నిరోధక వ్యవస్థ ఎలా మారుతుంది..? అన్న విషయంపై వీరు పరిశోధనలు చేశారు. ఈ మేరకు నేచర్ జర్నల్‌లో పలు వివరాలను ప్రచురించారు.
కరోనా సోకిన పిల్లల రక్తనాళాల్లో వాపు పెరిగిపోయి గుండె పనితీరుపై పడుతోందని వారు వివరించారు. 25 మంది కరోనా పాజిటివ్ రక్త నమూనాలను వారు పరిశీలించగా.. వారిలో కోవిడ్ లక్షణాలతో పాటు పీఐఎంఎస్-టీఎస్ లక్షణాలు కనిపించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వీరితో పాటు కరోనా సోకిన తల్లిదండ్రులకు దగ్గరగా ఉన్న పిల్లల నమూనాలను, ఆరోగ్యంగా ఉన్న మరో ఏడుగులు పిల్లల ఫలితాలతో పోల్చి చూపారు. పీఐఎంఎస్-టీఎస్ లక్షణాలున్న పిల్లల్లో సైకోటైన్లు పెరిగిపోయి వ్యాధి నిరోధక వ్యవస్థకు కీలకమైన లింఫోసైట్లు(తెల్ల రక్తకణాలు) తగ్గిపోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే వారి రోగనిరోధక వ్యవస్థలో జరిగే మార్పులు సైతం సంక్లిష్టంగా ఉన్నట్లు వారు వెల్లడించారు. ఒకరకంగా చెప్పాలంటే శరీరం అంతటా రక్తనాళాలు ఎర్రబడే కవసాకి వ్యాధి తరహ లక్షణాలు కరోనా సోకిన పిల్లల్లో ఉన్నట్లు కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్న తరువాత.. వారి రోగ నిరోధక వ్యవస్థ సాధారణ స్థితికి వస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Read More: