Telangana News: సర్పంచ్‌కు కరోనా.. అయినా గ్రామ సభకు హాజరయ్యాడు….

|

Jul 11, 2021 | 11:45 AM

ఊరు మంచి కోరేవాడు. ఊరి బాగోగులు చూసేవాడు. ఊళ్లో వారికి ఆదర్శంగా నిలవాలి. కాని ఆయన అలా చేయలేదు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల మధ్య ప్రజలు...

Telangana News: సర్పంచ్‌కు కరోనా.. అయినా గ్రామ సభకు హాజరయ్యాడు....
Sarpanch Corona
Follow us on

ఊరు మంచి కోరేవాడు. ఊరి బాగోగులు చూసేవాడు. ఊళ్లో వారికి ఆదర్శంగా నిలవాలి. కాని ఆయన అలా చేయలేదు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల మధ్య ప్రజలు, అధికారులు ప్రాణభయంతో జీవిస్తూ ఉంటే …వైరస్‌ సోకిందని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.  ఈ ఘనకార్యం వెలగబెట్టింది ఎవరో తెలుసా !. మంచిర్యాల జిల్లా వెల‌మ‌ప‌ల్లి గ్రామ సర్పంచ్  గోనె సత్యనారాయణ. ఈనెల 3న సత్యనారాయణకి కరోనా పాజిటివ్ వచ్చింది. డాక్టర్లు మందులు వాడుతూ ఇంట్లో ఉండమని సూచించారు. అయితే ఆయనగారు మాత్రం…గ్రామంలో ప‌ల్లె ప్రగ‌తి కార్యక్రమం, గ్రామ స‌భ ఉండటంతో కరోనాతో చికిత్స పొందుతూనే సమావేశాల్లో పాల్గొనడంతో అంతా ఆశ్చర్యపోయారు. వెల‌మ‌ప‌ల్లి మ‌హారాష్ట్రకు సమీపంలో ఉంది. ఇప్పటికే ఇక్కడ కరోనా యాక్టివ్ కేసులు 30కిపైగా ఉన్నాయి.

ఇక సర్పంచ్‌ తీరుతో గ్రామస్తులు మరింత భయాందోళనకు గురవడంతో …పోలీసులు సీన్‌లోకి ఎంటరయ్యారు. గ్రామంలో పర్యటించి కరోనా సోకిన వాళ్లు వ్యాధి నయమయ్యేవరకు బయట తిరగవద్దన్నారు. అయితే పల్లెప్రగతి కన్సల్టెంట్ అధికారి, కోటపల్లి మండల పంచాయితీ అధికారి సూచనల మేరకే సర్పంచ్ గ్రామసభకు హాజరైనట్లుగా తెలుస్తోంది. క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో అప్రమ‌త్తమైన ప్రభుత్వం ఒక వైపు స‌మీక్షలు నిర్వహిస్తూ నివార‌ణ చ‌ర్యలు చేపడుతుంటే …గ్రామ ప్రథమ పౌరుడే ఇలా నిర్లక్ష్యంగా వ్యవ‌హిరించ‌డం ఎంత వరకు కరెక్ట్ అనే విమర్శిస్తున్నారు గ్రామస్తులు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరోనా పాజిటివ్ గా తేలినా..  సింటమ్స్ ఉన్నా క్వారంటైన్ లో ఉండాలి. జనసమూహానికే కాదు ఇంట్లోనూ అందరికీ దూరంగా కనీసం 14 రోజులు ఉండాలి. అప్పుడు కూడా వ్యాధి నయం అయిందని నిర్ధారణ అయితేనే సాధారణ జీవనం గడపాలి.

Also Read:  పెంపుడు కుక్క తరచూ మొరుగుతోందని ఓ వ్యక్తి చేసిన పనిని చూస్తే షాక్‌ అవుతారు..!

గేదె శిశువులో బవిన్ వైరస్ ..! జంతువుల నుంచి మానవులకు వచ్చే అవకాశం..