కరోనా దెబ్బ.. ఇషా కేంద్రం క్లోజ్..

| Edited By:

Mar 21, 2020 | 5:43 PM

కంటికి కనపడని ఈ కరోనా వైరస్ ఇప్పడు ప్రపంచాన్ని వణికిస్తోంది. మూడవ ప్రపంచ యుద్దం వస్తుందో లేదో కానీ.. ప్రస్తుతం మాత్రం కరోనాతో ప్రపంచ దేశాలన్నీ యుద్ధం చేస్తున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే పదివేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో మూడు లక్షల మంది వరకు దీని బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మన దేశంలో కూడా ఈ వైరస్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే […]

కరోనా దెబ్బ.. ఇషా కేంద్రం క్లోజ్..
Follow us on

కంటికి కనపడని ఈ కరోనా వైరస్ ఇప్పడు ప్రపంచాన్ని వణికిస్తోంది. మూడవ ప్రపంచ యుద్దం వస్తుందో లేదో కానీ.. ప్రస్తుతం మాత్రం కరోనాతో ప్రపంచ దేశాలన్నీ యుద్ధం చేస్తున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే పదివేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో మూడు లక్షల మంది వరకు దీని బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మన దేశంలో కూడా ఈ వైరస్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అన్ని పాఠశాలలు, కాలేజీలు, మాల్స్, థియేటర్లు మూసేయాలని ఆదేశాలు జారీ చేశాయి. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇషా ఫౌండేషన్ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసినట్లు జగ్గీ వాసుదేవ్ తెలిపారు.

తాజాగా.. కోయంబత్తూరు కేంద్రంగా నడిచే యోగా కేంద్రాన్ని కూడా కొద్ది రోజులు మూసేవేస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్ వణికిస్తుందని.. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను తప్పకుండా పాటిస్తూ.. ప్రజల్లో అవగాహన కల్పిస్తామని తెలిపారు. సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆధ్వర్వంలో నడిచే ఈ ఇషా ఫౌండేషన్ కేంద్రంలో ఉన్న.. ధ్యానలింగ, ఆదియోగి ప్రాంగణాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చిన తర్వాత తెరవనున్నారు. నిత్యం ఈ రెండు ప్రాంగణాలను వేలల్లో ప్రజలు దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.