తెరుచుకున్న శబరిమల ఆలయం.. కానీ భక్తులకు నో ఎంట్రీ..

కేరళలోని శబరిమల కొండలపై కొలువైన అయ్యప్ప దేవాలయం నేడు తెరచుకుంది. నెలవారీ పూజల నిమిత్తం ఆలయాన్ని ఐదు రోజుల పాటు తెరచివుంచనున్నారు. అయితే, కరోనా వ్యాప్తి దృష్ట్యా, భక్తులకు మాత్రం ఆలయంలోకి ప్రవేశం లేదని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు...

తెరుచుకున్న శబరిమల ఆలయం.. కానీ భక్తులకు నో ఎంట్రీ..

Edited By:

Updated on: Jun 14, 2020 | 12:41 PM

కేరళలోని శబరిమల కొండలపై కొలువైన అయ్యప్ప దేవాలయం నేడు తెరచుకుంది. నెలవారీ పూజల నిమిత్తం ఆలయాన్ని ఐదు రోజుల పాటు తెరచివుంచనున్నారు. అయితే, కరోనా వ్యాప్తి దృష్ట్యా, భక్తులకు మాత్రం ఆలయంలోకి ప్రవేశం లేదని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. అయ్యప్ప దర్శనానికి భక్తులు రావద్దని అధికారులు కోరారు. కేరళలో కరోనా వ్యాప్తి కాస్తంత తక్కువగా ఉన్నప్పటికీ, ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తే, తిరిగి వైరస్ వ్యాపించే ప్రమాదం ఉన్నందున, ప్రస్తుతానికి భక్తులకు అనుమతి లేదని ఆలమ అధికారులు వెల్లడించారు. పరిస్థితులను సమీక్షించి.. భక్తుల ప్రవేశంపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. స్వామివారికి జరిగే పూజలను అర్చకులే ఏకాంతంగా నిర్వహిస్తారని అధికారులు పేర్కొన్నారు.

కాగా శబరిమల ఆలయంలోకి ఒకసారి 50 మంది భక్తులను మాత్రమే అనుమతి ఇస్తామని, వర్చువల్ క్యూ మేనేజ్ మెంట్ సిస్టమ్ ద్వారా రద్దీని నియంత్రిస్తామని కేరళ సీఎం పినరయి విజయన్ కొన్ని రోజుల క్రితం చెప్పారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా విజృంభణ దృష్ట్యా తాజాగా భక్తులకు అనుమతి లేదని నిర్ణయించింది కేరళ ప్రభుత్వం.

Read More: 

హైపర్ ఆదికి అనసూయ బంపర్ ఆఫర్.. తనతో సమానంగా రెమ్యునరేషన్..

అసభ్యంగా ప్రవర్తించాడని.. కొడుకుపైనే కేసు పెట్టిన నటి

భక్తులకు గుడ్‌న్యూస్.. శ్రీకాళహస్తిలో దర్శనాలకు గ్రీన్ సిగ్నల్..