ఆగస్ట్‌ 10 లోపు కరోనా వ్యాక్సిన్ అంటూ రష్యా ప్రకటన..!

| Edited By:

Jul 30, 2020 | 6:14 PM

కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు తమ దగ్గర వ్యాక్సిన్ రెడీ అయినట్లు రష్యా మరోసారి ప్రకటించింది. అంతేకాదు.. ఆగస్ట్‌ 10వ తారీఖు లోగా కరోనా వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి తీసుకొస్తామని రష్యా..

ఆగస్ట్‌ 10 లోపు కరోనా వ్యాక్సిన్ అంటూ రష్యా ప్రకటన..!
Follow us on

కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు తమ దగ్గర వ్యాక్సిన్ రెడీ అయినట్లు రష్యా మరోసారి ప్రకటించింది. అంతేకాదు.. ఆగస్ట్‌ 10వ తారీఖు లోగా కరోనా వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి తీసుకొస్తామని రష్యా ప్రకటించింది. రష్యాకు చెందిన గమేలియా ఇన్‌స్టిట్యూట్‌ డెవలప్‌ చేసిన కరోనా వ్యాక్సిన్‌ను ఆగస్ట్‌ 10వ తేదీ లోగా అనుమతులనిచ్చి.. ఆ తర్వాత ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని రష్యన్ అధికారులు తెలిపారు. వ్యాక్సిన్‌ విడుదల చేసిన తర్వాత.. తొలుత వైరస్ సోకిన వైద్యలకు అందిస్తామన్నారు. ఆ తర్వాత.. ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్‌కు అందజేస్తామన్నారు. ఆ తర్వాత ప్రజలకు ఇస్తామని అధికారులు తెలిపారు. అయితే రష్యా ప్రకటనలపై ఓ క్లారిటీ లేకుండా పోయింది. ఎందుకంటే ఫస్ట్ ఫేస్, సెకండ్‌ ఫేస్ పరీక్షలు ఎంతమందిపై చేశారన్న దానిపై పూర్తి క్లారిటీ లేదన్న అభిప్రాయం ఉంది. అంతేకాదు.. ఇప్పటికే యూకే, యూఎస్, కెనడా దేశాలు.. రష్యాపై పలు ఆరోపణలు చేశాయి. వ్యాక్సిన్‌కు సంబంధించిన సమాచారాన్ని హ్యాక్‌ చేసేందుకు రష్యన్ హ్యాకర్లు ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు చేశాయి.

 

Read More

భవనంలో భారీ పేలుడు.. 16 మందికి గాయాలు

వెస్ట్‌ బెంగాల్‌ కాంగ్రెస్ చీఫ్‌ గుండెపోటుతో మృతి

దేశంలో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజే అరలక్షకు పైగా కేసులు