గిన్నెలు కడగడం కాదు.. నేను సినిమా తీశాను.. ప్రముఖులపై వర్మ సెటైర్స్

| Edited By: Pardhasaradhi Peri

May 27, 2020 | 5:48 PM

డైరెక్టర్ ఆర్జీవీ రొటీన్‌కి భిన్నంగా ఆలోచిస్తూంటారు. అలాగే వివాదాలు సృష్టించడంలో కానీ.. గొడవలు తీసుకురావడంలో కానీ ముందుంటారనే చెప్పాలి. కాగా లాక్‌డౌన్‌లో బయటకు రావడమే గగనమయ్యే పరిస్థితిలో ఆయన ఏకంగా ఓ సినిమానే తెరకెక్కించారు. కరోనా వైరస్ గుప్పిట్లో ప్రపంచమంతా కొట్టుమిట్టాడుతుంటే..

గిన్నెలు కడగడం కాదు.. నేను సినిమా తీశాను.. ప్రముఖులపై వర్మ సెటైర్స్
Follow us on

డైరెక్టర్ ఆర్జీవీ రొటీన్‌కి భిన్నంగా ఆలోచిస్తూంటారు. అలాగే వివాదాలు సృష్టించడంలో కానీ.. గొడవలు తీసుకురావడంలో కానీ ముందుంటారనే చెప్పాలి. కాగా లాక్‌డౌన్‌లో బయటకు రావడమే గగనమయ్యే ఈ పరిస్థితిలో ఆయన ఏకంగా ఓ సినిమానే తెరకెక్కించారు. కరోనా వైరస్ గుప్పిట్లో ప్రపంచమంతా కొట్టుమిట్టాడుతుంటే.. దానిపై సినిమానే తీసి.. ఔరా అనిపించారు. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఈ సినిమా ట్రైలర్ ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. ఈ కరోనా చిత్రంపై అమితాబచ్చన్ కూడా ట్వీట్ చేసి ప్రశంసించారు.

ఈ సందర్బంగా ఆర్జీవీ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌లోనే కథను డిసైడ్ చేశానని, లాక్‌డౌన్‌లోనే షూట్ చేశానని చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాపై వస్తోన్న మొదటి చిత్రం ఇదేనని పేర్కొన్నారు. తాజాగా తన గురించి తానే చెబుతూ సినీ ఇండస్ట్రీపై సెటైరికల్ కామెంట్స్ చేశారు ఆర్జీవీ. ‘సినిమా పరిశ్రమకు చెందిన మిగతా వారంతా ఇళ్లు తుడవడం, వంట చేయడం, బట్టలు ఉతకడం.. వంటివి చేస్తే.. నేను మాత్రం ఓ సినిమా తెరకెక్కించా’ అంటూ.. కండలు చూపిస్తూ ఉన్న ఎమోజీలను పోస్ట్ చేశారు.

లాక్‌డౌన్‌తో.. ఇటీవల సెలబ్రిటీలందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో రకరకాల ఛాలెంజ్‌లు అంటూ ఇళ్లు శుభ్ర పర్చడం, గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం వంటివి చేస్తూ సవాళ్లు విసురుకున్న విషయం తెలిసిందే.

Read More:

మాజీ లవర్స్.. క్లోజ్ ఫ్రెండ్స్..? రానాకు త్రిష వార్నింగ్!

వాహనదారులకు మరో శుభవార్త.. ఇక వాట్సాప్‌ నుంచి రవాణా శాఖ సేవలు..

కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు