Ram Gopal Varma: ప్యారేలాల్‌, సుబ్బారావ్‌, చింటూ.. పేర్లు పెట్టొచ్చుగా..? కోవిడ్ పేర్లపై వర్మ సెటైర్

|

Jun 25, 2021 | 5:36 AM

RGV asked scientists: సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్టైలే వేరు.. ఆయన ఏదైతే చెప్పదల్చుకున్నారో.. ఆ విషయాన్ని ముక్కుసూటిగా చెబుతారు. ఆయన చేసే

Ram Gopal Varma: ప్యారేలాల్‌, సుబ్బారావ్‌, చింటూ.. పేర్లు పెట్టొచ్చుగా..? కోవిడ్ పేర్లపై వర్మ సెటైర్
Ram Gopal Varma
Follow us on

RGV asked scientists: సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్టైలే వేరు.. ఆయన ఏదైతే చెప్పదల్చుకున్నారో.. ఆ విషయాన్ని ముక్కుసూటిగా చెబుతారు. ఆయన చేసే కొన్ని వ్యాఖ్యలు వివాదస్పదంగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. విచిత్రమైన వ్యాఖ్యలకు, చేష్టలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి తనదైన స్టైల్‌లో ట్విట్ చేసి మళ్లీ సంచలనంగా మారారు. తాజాగా వర్మ కరోనా వేరియంట్లపై సెటైరిక్‌గా ట్వీట్‌ చేశారు. అయితే ఆయన కరోనా పేర్లపై ఆయన ట్విట్ చేశారు.

వైరస్‌ వేరియంట్లకు ఎవరికీ అర్థం కాకుండా గుర్తుంచుకోవడం కష్టం అయ్యేలా.. నిపుణులు Bi7172, Nk4421, K9472 ,AV415 లాంటి పేర్లు ఎందుకు పెడుతున్నారు..? వైరస్‌ వేరియంట్లకు కూడా ప్యారేలాల్‌, చింటూ, జాన్‌ డేవిడ్‌, సుబ్బారావు ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టడం లేదంటూ రామ్ గోపాల్ వర్మ సైంటిస్టులను ప్రశ్నించారు. అర్ధం కానీ పేర్లను ఎందుకు పెడుతున్నారంటూ.. వర్మ ప్రశ్నిస్తూ ట్విట్ చేశారు.

అయితే.. వర్మ చేసిన ఈ ట్విట్‌కు కొద్ది మంది సైంటిఫిక్‌ సమాధానాలు ఇస్తుండగా.. మరికొందరు ఈ ఐటమ్‌ తెలివి తేటలతోనే సినిమాలు తీస్తున్నావా ఏంటీ ..? అంటూ వర్మపై సెటైర్లు వేస్తున్నారు. అయితే.. వర్మ అభిమానులు మాత్రం.. ఎప్పటిలాగానే.. పంచ్ వేశారంటూ నవ్వుకుంటున్నారు.

వర్మ చేసిన ట్విట్..

Also Read:

Sonu Supermarket : సూపర్ మార్కెట్ ఓపెన్ చేసిన సోనూ సూద్ .. బ్రెడ్డు, గుడ్డు అన్నీ హోమ్ డెలివరీనే.. చార్జీలు అదనం

Nivetha Pethuraj: భోజనంలో బొద్దింక; రెస్టారెంట్ పై స్విగ్గీకి ఫిర్యాదు చేసిన తమిళ హీరోయిన్!