రాజస్థాన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 620 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 54,290కి చేరింది. ఈ విషయాన్ని రాజస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 36,524 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 14,207 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి రాష్ట్ర వ్యాప్తంగా 810 మంది మరణించారు.
కాగా, దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లొ కొత్తగా మరో 53 వేల కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22 లక్షలకు చేరింది. వీటిలో ప్రస్తుతం 6.39 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 15.83 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
620 fresh #COVID19 cases & 10 deaths reported in the state, the total case tally rises to 54,290. The death toll stands at 810: Rajasthan Health Department pic.twitter.com/U01vfJbhdl
— ANI (@ANI) August 11, 2020
Read More :
దారుణం.. యూపీలో బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు
నా క్యాబినెట్‌లో ఇద్దరు మంత్రులకు కరోనా.. పుదుచ్చేరి సీఎం