ఎమ్మెల్యే సహా, 18 మంది కుటుంబ సభ్యులకు కరోనా

దేశంలో కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తోంది. రోజురోజుకూ వైరస్ తీవ్రత అంతకంతకూ విజృంభిస్తోంది. కోవిడ్ ధాటికి సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. తాజాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరికి కరోనా వైరస్ సోకగా..వారి కుటుంబంలో మొత్తం 18 మంది వైరస్ బారినపడినట్లు తేలింది.

ఎమ్మెల్యే సహా, 18 మంది కుటుంబ సభ్యులకు కరోనా

Edited By:

Updated on: Jun 23, 2020 | 12:19 PM

దేశంలో కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తోంది. రోజురోజుకూ వైరస్ తీవ్రత అంతకంతకూ విజృంభిస్తోంది. కోవిడ్ ధాటికి సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. తాజాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరికి కరోనా వైరస్ సోకగా..వారి కుటుంబంలో మొత్తం 18 మంది వైరస్ బారినపడినట్లు తేలింది. ఈ సంఘటన రాజస్థాన్‌లో తీవ్ర కలకలం రేపింది.

రాజస్థాన్‌లోని బారి నియోజకవర్గానికి చెందిన గిరిరాజ్ సింగ్ మలింగ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కరోనా టెస్టులు చేశారు. వారిలో 18 మందికి కరోనా సోకినట్లు రిపోర్టులు రావడంతో కలకలం రేగింది. దీంతో వారందరినీ ఐసోలేషన్‌ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేను కలిసి వారితో పాటు కుటుంబ సభ్యులు ఎవరెవరిని కలిశారనే దానిపై అధికారులు ట్రేసింగ్ మొదలు పెట్టారు.

ఇక, రాజస్థాన్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,930 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు వైరస్‌ బారినపడి 349 మంది చనిపోయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.