హైదరాబాద్‌లో భారీ వర్షం.. కుప్పకూలిన పాత భవనం

|

Jul 02, 2020 | 11:13 PM

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్‌, సనత్‌నగర్‌.. కూకట్‌పల్లి, పటాన్‌చెరు, ఖైరతాబాద్‌, నాంపల్లి..కుత్బుల్లాపూర్‌, రాజేంద్రనగర్‌ సహా పలుచోట్ల వర్షం కురిసింది. రాత్రికి వర్షం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ వాఖ చెప్పడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్పమత్తమయ్యారు. అటు శంషాబాద్‌లో భారీ వర్షానికి ఓ పాత భవనం కూలి పోయింది. పక్కనే పార్క్‌ చేసి ఉన్న కారుపై కూలింది. కారులో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పాత భవనం కూలడంతో భవనం ముందు […]

హైదరాబాద్‌లో భారీ వర్షం.. కుప్పకూలిన పాత భవనం
Follow us on

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్‌, సనత్‌నగర్‌.. కూకట్‌పల్లి, పటాన్‌చెరు, ఖైరతాబాద్‌, నాంపల్లి..కుత్బుల్లాపూర్‌, రాజేంద్రనగర్‌ సహా పలుచోట్ల వర్షం కురిసింది. రాత్రికి వర్షం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ వాఖ చెప్పడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్పమత్తమయ్యారు.

అటు శంషాబాద్‌లో భారీ వర్షానికి ఓ పాత భవనం కూలి పోయింది. పక్కనే పార్క్‌ చేసి ఉన్న కారుపై కూలింది. కారులో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పాత భవనం కూలడంతో భవనం ముందు పార్క్ చేసి ఉన్న మారుతీ కారుపై భవనం శిధిలాలు పడడంతో కారు ద్వసం అయింది.

మరో రెండు రోజులపాటు హైదరాబాద్ మేఘావృతమై ఉంటుంది.. తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిస్తాయని.. రేపు అక్కడ అక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.