రైల్ భవన్‌లో కరోనా కలకలం..2రోజుల పాటు ఢిల్లీ ప్రధాన కార్యాలయం మూసివేత

|

Jul 14, 2020 | 3:21 PM

భారత్‌లో కరోనా కల్లోలం స‌ృష్టిస్తోంది. రోజురోజుకూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు స్థాయిలో నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా మహమ్మారి అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా, ఎవరిన్నీ వదలకుండా వెంటాడుతూనే ఉంది. తాజాగా..

రైల్ భవన్‌లో కరోనా కలకలం..2రోజుల పాటు ఢిల్లీ ప్రధాన కార్యాలయం మూసివేత
Follow us on

భారత్‌లో కరోనా కల్లోలం స‌ృష్టిస్తోంది. రోజురోజుకూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు స్థాయిలో నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటికీ పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్నాయి. మరోవైపు కరోనా మహమ్మారి అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా, ఎవరిన్నీ వదలకుండా వెంటాడుతూనే ఉంది. తాజాగా ఢిల్లీలోని రైల్వే శాఖ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం రేపింది.

ఢిల్లీలోని రైల్వే శాఖ ప్రధాన కార్యాలయం రైల్వే భవన్‌లో కరోనా వైరస్ కలకలం రేపింది. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో పలువురు అధికారులకు కరోనా పాజటివ్‌గా నిర్ధారణ అయినట్లు రైల్వే భవన్ అధికారులు వెల్లడించారు. దీంతో రైల్ భవన్‌ను రెండ్రోజుల పాటు మూసివేస్తున్నట్టు రైల్వే శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. మంగళ, బుధవారం రెండు రోజులపాటు రైల్వే భవన్‌ను మూసివేసి పూర్తి స్థాయిలో శానిటైజ్ చేయాలని నిర్ణయించామని రైల్వేశాఖ వెల్లడించింది. ఈ రెండు రోజులు అధికారులు ఇంటి వద్ద నుంచే పనిచేస్తారని తెలిపింది. ఈ నెల 9, 10, 13 తేదీల్లో నిర్వహించిన ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో రైల్వే బోర్డుకు చెందిన పలువురు అధికారులకు కొవిడ్ పాజటివ్ ఉన్నట్టు తేలిందని రైల్వే శాఖ ప్రకటించింది.

మరోవైపు దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 9 లక్షలు దాటింది. 8 లక్షల కేసులను దాటిన మూడు రోజుల వ్యవధిలోనే దేశంలో మరో లక్ష కేసులు నమోదు కావడం కరోనా తీవ్రతకు అద్దం పడుతోందంటూ పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.