కరోనా బారిన పడ్డ పంజాబ్ జైళ్ల శాఖ మినిస్టర్

పంజాబ్ కేబినెట్ మంత్రి సుఖ్జిందర్ సింగ్ రాంధావా కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్టు సీఎం అమరీందర్ సింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ''నా కేబినెట్ సహచరుడు, సహకార, జైళ్ల శాఖ మంత్రి సుఖ్జిందర సింగ్ రాంధావాకు పరీక్షలో కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ..

కరోనా బారిన పడ్డ పంజాబ్ జైళ్ల శాఖ మినిస్టర్

Edited By:

Updated on: Aug 23, 2020 | 11:13 AM

ప్రస్తుతం పలువురు రాజకీయ నాయకులు వరుసగా కోవిడ్ బారిన పడుతూనే ఉంటున్నారు. తాజాగా పంజాబ్ కేబినెట్ మంత్రి సుఖ్జిందర్ సింగ్ రాంధావా కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్టు సీఎం అమరీందర్ సింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ”నా కేబినెట్ సహచరుడు, సహకార, జైళ్ల శాఖ మంత్రి సుఖ్జిందర సింగ్ రాంధావాకు పరీక్షలో కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఆయన త్వరగా కోలుకోవాలని.. మళ్లీ అందరితో కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు” సీఎం అమరీందర్ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. ఇక పంజాబ్ క్యాబినెట్ మంత్రుల్లో కరోనా బారిన పడిన వారిలో సుఖ్జిందర్ మూడో వారు. ఇంతకు ముందు మంత్రులు తృప్తి రాజిందర్ సింగ్ బజ్వా, గురు ప్రీత్ సింగ్ కాంగర్ వైరస్ ఇన్‌ఫెక్షన్‌‌కు గురయ్యారు.

కాగా ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో శనివారం కొత్తగా 1320 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. దీంతో ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 40,643 మంది కరోనా మహమ్మారి బారినపడగా, 24,302 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా 1036 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడింది.

Read More:

సంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న డైరెక్టర్ శివ నిర్వాణ

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి.. ఈ రోజు ఎన్ని కేసులంటే?