
మే 1 వ తేదీన కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ సారి కరోనా వైరస్‌పై పోరుకు మద్దతుగా ప్రజలంతా తమతమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగరేయాలంటూ పంజాబ్ కాంగ్రెస్ కోరింది.మే డే కార్యక్రమం సందర్భంగా ఈ జెండా ఎగరేసే కార్యక్రమం చేపట్టాలని పంజాబ్ రాష్ట్ర ప్రజలను కోరింది. ఈ సందర్భంగా పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సునీల్ జక్కర్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. కరోనాపై పోరుకు ప్రజలంతా మద్దతుగా నిలవాలని.. మే 1 వ తేదీన ప్రజలంతా ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలని కోరారు.కాగా.. ఈ సారి కరోనా నేపథ్యంలో మే 3వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మేడే వేడుకలు ఎలాంటి ఆర్భాటాలు లేకుండానే కార్యాలయాలకే పరమితమవ్వనున్నాయి. ఇక పంజాబ్‌లో పెరుగుతున్న కేసులు నేపథ్యంలో లాక్‌డౌన్ మరిన్ని రోజులు రాష్ట్రంలో కొనసాగించనున్నారు.