కరోనా కట్టడికి అవి ‘సురక్షా కవచాలు’..ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

| Edited By: Pardhasaradhi Peri

Jul 13, 2020 | 1:09 PM

పల్స్ ఆక్సీమీటర్లను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్ 'సురక్షా కవచాలు'గా అభివర్ణించారు. నగరంలో హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా రోగుల మరణాలను తగ్గించడంలో ఇవి ఎంతగానో తోడ్పడ్డాయన్నారు. స్వల్ప లక్షణాలతో..

కరోనా కట్టడికి అవి సురక్షా కవచాలు..ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
Follow us on

పల్స్ ఆక్సీమీటర్లను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్ ‘సురక్షా కవచాలు’గా అభివర్ణించారు. నగరంలో హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా రోగుల మరణాలను తగ్గించడంలో ఇవి ఎంతగానో తోడ్పడ్డాయన్నారు. స్వల్ప లక్షణాలతో ఇంట్లో స్వీయ నియంత్రణలో ఉన్న రోగులకు, ఎసింప్టోమాటిక్ వ్యక్తులకు ప్రభుత్వం ఈ పల్స్ ఆక్సీమీటర్లను అందజేసిందని ఆయన చెప్పారు. తమ రక్తంలో ఆక్సిజన్ తగ్గుతోందని తెలుసుకున్న రోగులెవరైనా సహాయం కోరగానే తక్షణమే వారి ఇళ్లకు ఈ సాధనాన్ని పంపుతున్నామని, దాంతో వారిని ఆసుపత్రికి తరలించగలుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. పేషంట్ల బ్లడ్ లోని ఆక్సిజన్ ని ఇది కొలుస్తుందని కేజ్రీవాల్ తెలిపారు. రోగులుతమ ఆక్సిజన్ స్థాయి 90 శాతం, లేదా అంతకన్నా తగ్గిన పక్షంలో వారిని హాస్పిటల్ కి తరలిస్తున్నారు. ఈ సాధనాన్ని వాడిన  రోగుల్లో మరణాల సంఖ్య చాలావరకు తగ్గిపోయిందని కేజ్రీవాల్ వెల్లడించారు. వీటిని వినియోగించిన రోగుల్లో ఈ నెల మొదటివారంలో ఎవరూ మరణించలేదని, రోజువారీ మరణాల సంఖ్య కూడా తగ్గిందని ప్రభుత్వం తెలిపింది.