కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించిన పుదుచ్చేరి

కేంద్ర పాలి ప్రాంతమైన పుదుచ్చేరిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో మంగళవారం నాడు పూర్తిగా..

కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించిన పుదుచ్చేరి

Edited By:

Updated on: Aug 18, 2020 | 8:09 PM

కేంద్ర పాలి ప్రాంతమైన పుదుచ్చేరిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో మంగళవారం నాడు పూర్తిగా లాక్‌డౌన్ విధించింది. దీంతో అక్కడి ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. దుకాణాలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నీ మూతపడ్డాయి. మెడికల్ షాపులు, కిరాణా షాపులు, పాల కేంద్రాలు, గ్యాస్ సిలిండర్ల సరఫరా సంస్థలు మాత్రమే ఓపెన్‌ ఉన్నాయి. ప్రజలంతా వీధుల్లో సంచరించకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకే ఈ లాక్‌డౌన్‌ విధించినట్లు పుదుచ్చేరి సీఎంవో తెలిపింది.

కాగా, ఇప్పటివరకు పుదుచ్చేరిలో 8,396 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వీటిలో కరోనా నుంచి కోలుకుని 4,909 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 3,364 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More :

మేఘాలయకు బదిలీ అయిన గోవా గవర్నర్

బ్రెజిల్‌లో 33 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు