ఎస్సై మానవత్వం: కుటుంబ సభ్యులు వదిలేసినా, కరోనా మృతురాలి అంత్యక్రియలు..

|

Oct 22, 2020 | 6:03 PM

కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచం మొత్తం అతలాకుతలం అయింది. ఒక్కసారిగా ప్రపంచమంతా స్తంభించిపోయింది. కరోనా వైరస్ వ్యాప్తి మొదలయ్యాక భౌతిక దూరం పాటిస్తే చాలని ప్రభుత్వాలు చెబుతుంటే జనం మాత్రం అన్ని బంధాలకూ దూరమై...

ఎస్సై మానవత్వం: కుటుంబ సభ్యులు వదిలేసినా, కరోనా మృతురాలి అంత్యక్రియలు..
Follow us on

కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచం మొత్తం అతలాకుతలం అయింది. ఒక్కసారిగా ప్రపంచమంతా స్తంభించిపోయింది. కరోనా వైరస్ వ్యాప్తి మొదలయ్యాక భౌతిక దూరం పాటిస్తే చాలని ప్రభుత్వాలు చెబుతుంటే జనం మాత్రం అన్ని బంధాలకూ దూరమైపోతున్న ఘటనలు చూస్తున్నాం. ఆఖరికి కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు కూడా ఎవరు ముందుకు రావట్లేదు. అయితే తాజాగా ఏపీలోని నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామంలో వెలుగు చూసిన ఘటనతో మానవత్వం ఇంకా బతికేఉందని రుజువైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని పోలంగారిపల్లి గ్రామంలో ఓ వృద్ధ మహిళ కరోనా సోకి మరణించింది. దీంతో ఆ మహిళ మృతదేహన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. మృతురాలికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. చివరకు గ్రామస్తులు కూడా తమకేమీ పట్టనట్లుగానే ఉండిపోయారు. ఈ విషయం చివరకు పోలీసులకు తెలిసింది.

సీతారాంపురం ఎస్ ఐ రవీంద్ర నాయక్ ఆయన సిబ్బందితో పాటు గ్రామానికి చేరుకున్నారు. అందరూ పీపీ కిట్లు ధరించి ఆ వృద్ధురాలి అంత్యక్రియలు నిర్వహించారు. అంతేకాదు, అంత్యక్రియలకు కావాల్సిన అన్ని ఖర్చులు తానే భరించి కార్యక్రమం నిర్వహించారు. సొంత మనుషులే వదిలేసిన కరోనా మృతురాలి అంత్యక్రియలను నిర్వహించడం ద్వారా సీతారాంపురం పోలీసు ఎస్ఐ శభాష్ అనిపించుకున్నారు.