Coronavirus Curfew: కర్ఫ్యూ వేళలో కూరగాయలు అమ్ముతున్నాడని పోలీసుల అటాక్..! 17ఏళ్ల కుర్రాడు మృతి

|

May 22, 2021 | 7:05 PM

కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో లాక్‌డౌన్‌ ఒక్కటే కట్టడికి మార్గమని భావించి చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ను క్షేత్రస్థాయిలో....

Coronavirus Curfew: కర్ఫ్యూ వేళలో  కూరగాయలు అమ్ముతున్నాడని పోలీసుల అటాక్..!  17ఏళ్ల కుర్రాడు మృతి
Up Teen Dies
Follow us on

కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో లాక్‌డౌన్‌ ఒక్కటే కట్టడికి మార్గమని భావించి చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతున్నారు. తమ విధుల్లో బిజీగా ఉన్నప్పటికీ వీలున్నప్పుడల్లా కోవిడ్‌ బాధితులకు అండగా నిలుస్తున్నారు. అయితే కొంత మంది పోలీసుల ఓవరాక్షన్‌ ఆ శాఖకు మచ్చ తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌ ఉన్నావ్‌ జిల్లాకు చెందిన 17ఏళ్ల టీనేజర్‌ను కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించాడని ఓ కానిస్టేబుల్‌ చితకబాదాడు. దాంతో ఆ అబ్బాయి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే ఉన్నావ్‌ జిల్లా బంగర్మౌ పట్టణం భట్పురి ప్రాంతానికి చెందిన ఓ టీనేజ్‌ కుర్రాడు కర్ఫ్యూ వేళలో తన ఇంటి బయట కూరగాయలు అమ్ముతున్నాడని స్థానిక పోలీసులు స్టేషన్‌కి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. గాయాలకు తాళలేక కుర్రాడు సృహ తప్పి పడిపోయాడు. అతని పరిస్థితి విషమించడంతో స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

పోలీసుల వైఖరితో ఆగ్రహించిన స్థానికులు లక్నో రోడ్‌పై ధర్మాకు దిగారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అంతే కాకుండా బాధితుడి కుటుంబానికి పరిహారం చెల్లించి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. దీనిపై స్పందించిన పోలీసు శాఖ ఇద్దరు కానిస్టేబుల్స్‌, ఒక హోంగార్డును సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. కరోనా కేసులను అరికట్టడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మే 24 వరకు కర్ఫ్యూ విధించింది.

Also Read: ఆంధ్రా​ నుంచే ఆరంభం.. సోనూ సూద్ తొలి ఆక్సిజన్​ ప్లాంటు ఏపీలోనే

ఆర్​ఎంపీ, పీఎంపీలకు కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ వార్నింగ్… క‌రోనాకు చికిత్స చేస్తే క్రిమిన‌ల్ కేసులు