ఒమర్ అబ్దుల్లాకు ప్రధాని మోదీ ప్రశంసలు.. ఎందుకంటే ?

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం...మట్టూ నివాసంలో గానీ, ఆయన అంత్యక్రియలు జరిగే స్థలం వద్ద గానీ పెద్ద సంఖ్యలో గుమికూడవధ్దని అబ్దుల్లా తన మద్దతుదారులకు సూచించారు.

ఒమర్ అబ్దుల్లాకు ప్రధాని మోదీ ప్రశంసలు.. ఎందుకంటే ?

Edited By:

Updated on: Mar 31, 2020 | 3:21 PM

జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాను ప్రధాని మోదీ ప్రశంసించారు. కొన్ని రోజులుగా అస్వస్థులుగా ఉన్న అబ్దుల్లా సమీప బంధువు డాక్టర్ మహ్మద్ అలీ మట్టూ ఈ నెల 29 న మరణించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం…మట్టూ నివాసంలో గానీ, ఆయన అంత్యక్రియలు జరిగే స్థలం వద్ద గానీ పెద్ద సంఖ్యలో గుమికూడవధ్దని అబ్దుల్లా తన మద్దతుదారులకు సూచించారు. మట్టూ ఆత్మకు శాంతి కలగాలని ఇళ్లలోనే ఉండి ప్రార్దనలు చేయాలని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మోదీ.. మట్టూ మృతికి సంతాపం తెలియజేస్తూనే.. ఇంత విచారకరం సమయంలో కూడా మీ సపోర్టర్లకు మీరిలా సూచించడం హర్షణీయమన్నారు. కరోనాపై పోరాటానికి మనమంతా సన్నధ్ధులమై ఉన్న విషయాన్ని మీరు మరువలేదన్నారు. మీ నిర్ణయం అభినందనీయం అని పేర్కొన్నారు. ఇందుకు ఒమర్ అబ్దుల్లా కూడా ఆయన ప్రతిస్పందించిన తీరుకు కృతజ్ఞతలు తెలిపారు.