విషాదం.. కరోనాకు విరుగుడు కనుగొంటూ ఫార్మా కంపెనీ ఉద్యోగి మృతి..!

| Edited By:

May 09, 2020 | 3:42 PM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు విరుగుడు కనుగొంటూ ఫార్మా కంపెనీ ఉద్యోగి కన్నుమూశాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. కరోనాకు విరుగుడు కనుగొనాలని చెన్నైలోని సుజాత బయోటెక్‌ ఓనర్, ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగి ఇద్దరు పూనుకున్నారు. ఈ క్రమంలో తయారు చేసిన ద్రావకాన్ని వారు సేవించారు. అయితే ఆ ఔషదం కాస్త బెడిసి కొట్టడంతో.. ఉద్యోగి మరణించగా, ఓనర్‌ చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఓ ఆఫీసర్ వివరించారు. కాగా చనిపోయిన […]

విషాదం.. కరోనాకు విరుగుడు కనుగొంటూ ఫార్మా కంపెనీ ఉద్యోగి మృతి..!
Follow us on

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు విరుగుడు కనుగొంటూ ఫార్మా కంపెనీ ఉద్యోగి కన్నుమూశాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. కరోనాకు విరుగుడు కనుగొనాలని చెన్నైలోని సుజాత బయోటెక్‌ ఓనర్, ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగి ఇద్దరు పూనుకున్నారు. ఈ క్రమంలో తయారు చేసిన ద్రావకాన్ని వారు సేవించారు. అయితే ఆ ఔషదం కాస్త బెడిసి కొట్టడంతో.. ఉద్యోగి మరణించగా, ఓనర్‌ చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఓ ఆఫీసర్ వివరించారు. కాగా చనిపోయిన శివనేశన్‌ గత 27 సంవత్సరాలుగా సుజాత బయోటెక్‌లో ప్రాజెక్ట్ మేనేజర్‌గా చేస్తున్నారు.

దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ.. ”కరోనాకు విరుగుడు కనుగునే క్రమంలో సుజాత బయోటెక్‌ ఓనర్‌ రాజ్‌ కుమార్, శివనేశన్‌ గురువారం కలుసుకున్నారు. నైట్రిక్ ఆక్సైడ్, సోడియమ్‌ నైట్రేట్ ఉపయోగించి కరోనాకు విరుగుడు కనుక్కోవాలనుకున్నారు. ఇది విజయవంతమైతే తమకు మంచి లాభాలు రావొచ్చనే ఉద్దేశ్యంతో వారిద్దరు ఈ ప్రయోగానికి పూనుకున్నారు. తయారు చేసిన ఔషదాన్ని ఇద్దరూ సేవించగా.. ఇబ్బందులు తలెత్తాయి. వెంటనే వారిద్దరిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటూ గురువారం రాత్రి 8 గంటల సమయంలో శివనేశన్‌ కన్నుమూశాడు” అని వివరించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Read This Story Also: ‘టిక్‌టాక్‌’లోకి ‘బిగ్‌బాస్‌’ బ్యూటీ ఎంట్రీ.. ఒక్కరోజులోనే 4మిలియన్‌ ఫాలోవర్లు..!