AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవాంకా సహాయకురాలికి పాజిటివ్.. వైట్‌హౌస్‌లో టెన్ష‌న్..టెన్ష‌న్

అమెరికాలో కరోనా వీర‌విహారం చేస్తోంది. అక్కడ కరోనా సోకిన‌వారి సంఖ్య‌ 13.21 లక్షలు దాటగా.. దాదాపు 79వేల మంది చనిపోయారు. తాజాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక సహాయకురాలు, ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ప్రెస్​ సెక్రటరీ, కార్యాలయ అధికార ప్రతినిధి కేటీ మిల్లర్​కు వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. ఇవాంకా సహాయకురాలు గత కొన్ని వారాలుగా ఇంటి నుంచే వ‌ర్క్ చేస్తున్న‌ట్టు అధికారులు వెల్లడించారు. ఆమెకు కరోనా పాజిటివ్ అని తేల‌డంతో.. ఇవాంక, […]

ఇవాంకా సహాయకురాలికి పాజిటివ్.. వైట్‌హౌస్‌లో టెన్ష‌న్..టెన్ష‌న్
Ram Naramaneni
| Edited By: |

Updated on: May 09, 2020 | 3:30 PM

Share

అమెరికాలో కరోనా వీర‌విహారం చేస్తోంది. అక్కడ కరోనా సోకిన‌వారి సంఖ్య‌ 13.21 లక్షలు దాటగా.. దాదాపు 79వేల మంది చనిపోయారు. తాజాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక సహాయకురాలు, ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ప్రెస్​ సెక్రటరీ, కార్యాలయ అధికార ప్రతినిధి కేటీ మిల్లర్​కు వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. ఇవాంకా సహాయకురాలు గత కొన్ని వారాలుగా ఇంటి నుంచే వ‌ర్క్ చేస్తున్న‌ట్టు అధికారులు వెల్లడించారు. ఆమెకు కరోనా పాజిటివ్ అని తేల‌డంతో.. ఇవాంక, ఆమె భర్త జరేడ్ కుష్‌నర్‌కు టెస్టులు నిర్వహించారు. ఈ ఫ‌లితాల్లో నెగెటివ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇవాంకా సహాయకురాలు దాదాపు రెండు నెలల నుంచి టెలీవర్కింగ్ ద్వారా అధికారిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

కాగా, ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్ మీడియా ప్రతినిధిగా వ్యవహరిస్తున్న కేటీ మిల్లర్ అనే ఉద్యోగిణికి కూడా కరోనా సోకింది. ఈమె ట్రంప్‌ ముఖ్య ఉద్యోగి స్టీఫెన్‌ మిల్లర్‌‌కు భార్య. తాజా ఘటనతో శ్వేతసౌధంలో కోవిడ్-19 బాధితుల సంఖ్య మూడుకి చేరింది. వైట్‌హౌస్‌లో నిర్వహించిన అనేక కీలక సమావేశాల్లో విధి నిర్వహణలో భాగంగా కేటీ మిల్లర్ పాల్గొన్నారు. గురువారం కూడా ఆమె పాల్గొన్న ఓ ఓపెన్ ప్రేయ‌ర్ మీటింగ్ లో… ట్రంప్‌ సతీమణి మెలానియా, ఉపాధ్యక్షుడి భార్య సహా పదుల సంఖ్యలో ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో మెలానియా ట్రంప్‌, పెన్స్‌లకు క‌రోనా‌ నిర్ధారణ టెస్టులు చెయ్య‌గా, వారికీ నెగిటివ్‌ అని తేలింది. ఇకనుంచి వీరిరువురికి ప్రతిరోజూ కరోనా టెస్టులు చేయ‌నున్నట్టు అధికారులు చెప్తున్నారు. అధ్య‌క్షుడు ట్రంప్ విష‌యంలో‌ అన్ని జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా తీసుకుంటున్నామని వారు వివరించారు. అయితే ట్రంప్‌ మాత్రం వివిధ కార్యక్రమాలకు మాస్క్ లేకుండానే హాజరవుతుండటం గమనార్హం.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..