సీఎం జగన్‌ను మరోసారి అభినందించిన జనసేనాని

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లులు కురిపించారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వరుసగా అభినందిస్తున్నారు జనసేనాని...

సీఎం జగన్‌ను మరోసారి అభినందించిన జనసేనాని

Updated on: Jul 03, 2020 | 6:34 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లులు కురిపించారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వరుసగా అభినందిస్తున్నారు జనసేనాని. పదో తరగతి పరీక్షల రద్దు చేస్తూ.. ఏపీ సీఎం తీసుకున్ననిర్ణయాన్ని అభినందిస్తూ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే… ఇప్పుడు తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఆంబులెన్స్‌‌లను ప్రారంభించడాన్ని పవన్ సోషల్ మీడియాలో అభినందించారు.

‘ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు, అత్యవసర సేవల్ని అందించే ఆంబులెన్స్‌‌లను, ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం – అభినందనీయం. అలాగే,గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో, ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా, ప్రభుత్వం పనిచేస్తున్న తీరు – అభినందనీయం.’ అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అలాగే, ‘ఇది ప్రపంచానికే గడ్డు కాలం , అందుకే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ, రాష్ట్ర – కేంద్ర ప్రభుత్వాలికి, సహకరిద్దాం – క్షేమంగా ఉందాం.’ అంటూ మరో ట్వీట్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Follow Us