AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Holiday: విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త.. ఆగస్ట్ 13 వరకు వరుస సెలవులు! ఎందుకంటే?

School Holidays: దేశవ్యాప్తంగా స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు ఇదో శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే ఈ నెలలో వారికి వరుస సెలవులు రానున్నాయి. ఆగస్ట్ 13 వరకు పాఠశాలలకు వరుస సెలవులు ప్రకటిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ఉత్తర్వులు జారీ చేశాయి. స్థానికంగా కురుస్తున్న వర్షాలు, ప్రాంతీయ పండుగల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి. కాబట్టి ఏ రాష్ట్రంలో ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Aug 09, 2026 | 10:18 AM

Share
తెలంగాణలో సెలవులు: తెలంగాణలో విద్యార్థులకు వరుసగా రెండ్రోజుల పాటు సెలవులు దొరకనున్నాయి. ఆగస్ట్ 9వ తేదీన ఆదివారం కావడంతో సాధారణ సెలవు ఉండగా.. తెలంగాణ సర్కార్ సోమవారం కూడా సెలవును ప్రకటించింది. సోమవారం హైదరాబాద్‌లో బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

1 / 5
ఆంధ్రప్రదేశ్‌లో సెలవులు: అటు ఏపీలోనూ ఆగస్ట్ 9న ఆదివారం కారణంగా సాధారణ సెలవుదినం కాగా.. ఆగస్టు 21వ తేదీన కూడా విద్యార్థులకు సెలవు లభించనుంది. ఎందుకంటే ఆ రోజు వరమహాలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌తో సహా తెలంగాణలో కూడా పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ క్యాలెండర్‌కు తగ్గట్టుగా ఈ సెలవులను ప్రకటించాయి.

2 / 5
కేరళలో సెలవులు: ఇక కేరళలోనూ స్కూళ్లకు వరుస సెలవులు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 8 జిల్లాలకు భారీ వర్ష సూచనలు జారీ చేసింది వాతావరణ శాఖ. అలాగే వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించింది. గత వారం రోజులుగా కేరళ వ్యాప్తంగా స్కూల్స్ మూతపడే ఉన్నాయి.

3 / 5
ఉత్తర ప్రదేశ్‌లో సెలవులు: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కాన్వర్ యాత్ర సందర్భంగా అక్కడి విద్యాసంస్థలకు యూపీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. యాత్ర కారణంగా ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 10న ప్రభుత్వం సెలవును ప్రకటించింది. అయితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఆగస్ట్ 12వ తేదీ వరకు పలు జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ఉన్నాయి.

4 / 5
మణిపూర్, కర్ణాటకలో సెలవులు: ఇక మణిపూర్‌లోనూ ఆగస్టు 13ను రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. పేట్రియాట్స్ డే (Patriots' Day) సందర్భంగా ఆగస్టు 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అటు కర్ణాటకలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లోని స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

5 / 5
Follow Us
బలహీనంగా అనిపిస్తోందా? ఉదయాన్నే ఇవి తినండి!

పప్పుచారు రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి.. రుచి అద్దిరిపోతుంది!

హైదరాబాద్‌లో అర్ధరాత్రి దొంగల హల్‌చల్.. గోడలు దూకి చోరీకి యత్నం!

ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో మరో అప్డేట్..

ఒక్క తప్పుతో చేజారిన సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ సిక్సర్ షాట్ వైరల్

7.8 శాతం జీడీపీ వృద్ధి.. ప్రధాని మోదీ విధానాలతోనే సాధ్యమైంది!

32 మంది ప్రయాణికులతో వస్తున్న విమానానికి బాంబ్ బెదిరింపు

పులుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరింత బలమైన రక్షణ

ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? బర్త్‌డే ఫొటోస్ వైరల్

10వ తరగతి పాసైతే చాలు.. ఇండియా పోస్ట్‌లో 23,757 ఉద్యోగాలు! లింక్