హైదరాబాద్‌లో ఆషాఢం బోనాలు ప్రారంభం అయ్యి చివరి దశకు వచ్చాయి. నెల రోజుల పాటు ఘనంగా ఈ బోనాల పండుగ జరిగింది.
ప్రతి వాడలో పోతరాజుల వీరంగా, శివసత్తుల ఆటలతో, ఆడపడుచులు బోనం మెత్తి, అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో పూజించుకున్నారు.
నేడు బోనాలకు చివరి రోజు, ఆగస్టు 9న హైదరాబాద్ పాతబస్తీలో చాలా ఘనంగా లాల్ దర్వాజ బోనాల జాతర కొనసాగుతుంది.
అయితే ఈ క్రమంలోనే ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు బోనం ఎలా పుట్టింది అంటూ ఓ న్యూస్ వైరల్‌గా మారింది. దాని గురించి తెలుసుకుందాం.
బోనం అంటే భోజనం, ఆషాఢ మాసంలో ఆడపిల్లలు ఎలా అయితే పుట్టింటికి వస్తారో, అమ్మవార్లు కూడా అలా వస్తారని వారికి ప్రేమగా భోజనం వండి నైవేద్యం పెట్టడం బోనం.
1813లో జూలైలో హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ప్లేగు, కలరా వ్యాధులతో చాలా మంది ప్రాణాలు కోల్పోవడంతో అప్పుడు అమ్మవారికి బోనం సమర్పిస్తాం అని మొక్కడంతో వ్యాధులు తగ్గాయంట.
అప్పటి నుంచి హైదరాబాద్‌లో అమ్మవార్లకు బోనాలు సమర్పించడం ప్రారంభం అయ్యిందంట. ఇక ఇప్పుడే కాదండోయ్ 13 శతాబ్ధంలో కూడా బోనం సమర్పించే వారంట.
కాకతీయుల కాలంలో రాణి రుద్రమ దేవి, ఏకవీర దేవికి బోనం సమర్పించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయంట. అంటే ఆ కాలంలోనే బోనం ఉన్నదంట్లు, అప్పుడే తొలుత బోనం మొదలైందంట.
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.